- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ నేవీ ప్రధాన కేంద్రం నౌసేనా భవన్, కేవలం భవనం మాత్రమే కాదని, నయాభారత్‌కు, నయీ నౌసేనకు సంకేతమని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ వెల్లడించారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఉన్న ఈ కాంప్లెక్స్ అత్యంత ఆధునిక వసతులతో, సాంకేతిక సౌకర్యాలతో కూడుకున్నది.
గత వారమే కేంద్ర రక్షణ మంత్రి రాజేంద్రనాథ్ ఈ భవనాన్ని ప్రారంభించార. ఈ సందర్భంగా నూతన నౌసేనా భవన్ కాంప్లెక్స్ వద్ద ఆదివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఇది దేశానికి, జాతికి పురోగతి అని, సాగర రక్షణ వారసత్వం నుంచి భారత నేవీ చరిత్ర నుంచి స్ఫూర్తి చెందినదని, అభివృద్ధి చెందుతున్న భారత ఆకాంక్షలను, సాగర రక్షణ అవగాహనను ప్రాతినిధ్యం వహిస్తుందని హరికుమార్ పేర్కొన్నారు.
- Advertisement -