Wednesday, January 22, 2025

నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ కు తప్పిన పెను ప్రమాదం

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్‌: నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు ఆదివారం పెను ప్రమాదం తప్పింది. నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయందోళనకు గురయ్యారు. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ప్రయాణికులు. రైలు అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలును ఆపడంతో లోకో పైలట్ సత్వర చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

రైల్వే అధికారుల విచారణలో బ్రేక్‌ లైనర్‌లు జామ్‌ కావడంతో పొగలు వచ్చినట్లు తేలింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే దిగి అక్కడి నుంచి పరారయ్యారు. అంతరాయం కారణంగా ఆ ప్రాంతంలోని ఇతర రైలు సర్వీసులకు గణనీయమైన జాప్యం ఏర్పడింది. అదృష్టవశాత్తూ, రైలుకు ఎటువంటి నష్టం జరగలేదు. ప్రయాణీకులందరినీ సురక్షితంగా తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News