Saturday, November 23, 2024

నావీ రహస్యాల లీక్ కేసు: మరో కమాండర్‌పై సిబిఐ చార్జిషీట్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత నావీ రహస్యాలను లీక్ చేసిన కేసులో అదే విభాగంలోని మరో కమాండరైన జగదీశ్‌పై ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్టు అధికారులు తెలిపారు. జగదీశ్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ చివరన సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేసులోని ఆరుగురు నిందితులపై సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. జగదీశ్‌పై ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. అయితే, ఈ కేసులో అరెస్టయిన నావీకి చెందిన పలువురు ప్రస్తుత, మాజీ అధికారులు డిఫాల్ట్ బెయిల్‌పై విడుదల కావడం గమనార్హం. ఆయా కేసుల్లో అరెస్టయిన నిందితులపై 60 లేదా 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయాలి. అలా చేయని పక్షంలో నిందితులు డిఫాల్ట్ బెయిల్‌కు అర్హులవుతారు. అధికార రహస్యాల చట్టం(ఒఎస్‌ఎ) కింద అరెస్టయినవారిపై 60 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయాలి. దీనిని 90 రోజులుగా పొరపడ్డ సిబిఐ అధికారులు కోర్టుకు ఆలస్యంగా చార్జిషీట్ దాఖలు చేయడంతో నిందితుల తరఫు న్యాయవాదులు చట్టపరమైన అంశాన్ని గుర్తు చేసి డిఫాల్ట్ బెయిల్ ఇప్పించారు. దాంతో, నిందితులను తిరిగి అరెస్ట్ చేయడానికి వీలుగా సిబిఐ రక్షణశాఖకు మరోసారి ఫిర్యాదు చేయాలని సూచించింది. ఆ తదుపరి అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసే యోచనలో సిబిఐ ఉన్నట్టు తెలుస్తోంది.

Naval Secrets leak case: CBI files fresh charge sheet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News