Wednesday, January 22, 2025

నా కుమారుడి మృతదేహాన్ని అప్పగించడం లేదు: రష్యా కోర్టులో నావల్నీ తల్లి వ్యాజ్యం

- Advertisement -
- Advertisement -

మాస్కో: తన కుమారుడి మృతదేహాన్ని అప్పగించడానికి అధికారులు నిరాకరిస్తున్నారని ఆరోపిస్తూ రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ తల్లి లియుడ్మిలా రష్యాలో ఆర్కిటిక్ నగరమైన సలేఖర్డ్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై మార్చి 4న విచారణ జరగనున్నది. శనివారం నుంచి తన కుమారుడి మృతదేహం కోసం లియుడ్మిలా ప్రయత్నిస్తున్నారు. అయినా నావల్నీ మృతదేహం ఎక్కడుందో ఆమె కనుక్కోలేక పోతున్నారని నావల్నీ మద్దతుదారులు పేర్కొన్నారు.

కుమారుని అవశేషాలను అప్పగిస్తే గౌరవప్రదంగా అంతిమ సంస్కారం నిర్వహిస్తామని లియుడ్మిలా మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు విజ్ఞప్తి చేశారు. “ఇప్పటికి ఐదు రోజులైంది. అయినా నా కుమారుడి మృతదేహాన్ని నేను చూడలేక పోతున్నాను. ప్రభుత్వం ఆయన మృతదేహాన్ని అప్పగించడం లేదు. కనీసం ఆ మృతదేహం ఎక్కడుందో వారు చెప్పడం లేదు” అని 69 ఏళ్ల లియుడ్మిలా వీడియో ద్వారా ఆవేదన వెలిబుచ్చారు.

మాస్కోకు ఈశాన్య దిశలో 1900 కిమీ దూరంలో ఖార్ప్‌లో ఆమె ఉంటున్నారు. “పుతిన్.. నేను మిమ్మల్ని చేరుకుంటున్నాను. ఈ పరిష్కారం మీపై ఆధారపడి ఉంది. నా బిడ్డను కడసారి చూడనివ్వండి. తక్షణం నావల్నీ మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్ చేస్తున్నా. ఒక మనిషిగా ఆయన భౌతిక కాయాన్ని సమాధి చేయనీయండి” అని ఆమె ప్రాధేయపడ్డారు. నావల్నీ మిత్ర బృందం ఈ వీడియోను విడుదల చేసింది. అయితే రష్యా అధికారులు మాత్రం నావల్నీ మృతికి కారణం ఇంకా తెలియరాలేదని, ప్రాథమిక దర్యాప్తు జరుగుతున్నందున, మరో రెండు వారాల వరకు భౌతిక కాయాన్ని అప్పగించడం కుదరదని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News