Monday, December 23, 2024

మాకు 15 సెకన్లు చాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో బీజేపీ ఎంపి అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారం చేసిన బీజేపీ అమరావతి లోక్‌సభ అభ్యర్థి నవనీత్ రాణా, 2012లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. “15 నిమిషాలు పోలీస్‌లు పక్కకు తప్పుకుంటే లెక్కలు సరిచేస్తామని అక్బరుద్దీన్ ఓవైసీ ఆనాడు అన్నారు. కానీ వాళ్లకు 15 నిమిషాలేమో… మాకు 15 సెకన్లు చాలు. ” అని నవనీత్ కౌర్ సవాల్ విసిరారు. 2019లో అమరావతి నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన రాణా హైదరాబాద్ లోని బీజేపీ అభ్యర్థి మాధవీలత తరఫున ప్రచారం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

దీనికి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. “ఆమెకు గంట సమయం ఇవ్వాలని తాము ప్రధాని మోడీని కోరతాం. “ మోడీజీ అధికారం మీకుంది. గంట సమయం కన్నా 15 నిమిషాలు ఆమెకివ్వండి. మేం కూడా మానవత్వం ఎంత మిగిలి ఉందో లేదో చూస్తాం. మేం భయపడం. మిమ్మల్ని ఎవరాపుతారు? ప్రధాని మీ వ్యక్తి. ఢిల్లీలో ఉంటారు. ఆర్‌ఎస్‌ఎస్ మీది. ప్రతీదీ మీదే. చెప్పండి ఎక్కడకు రమ్మంటారు. అక్కడకు వస్తాం. ” అని ఓవైసీ సోదరులు గట్టి కౌంటర్ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News