Sunday, January 19, 2025

ఓ ఇంటివాడైనా నవదీప్ షైనీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత జట్టు యువ పేసర్ నవదీప్ షైనీ ఓ ఇంటి వాడయ్యాడు. శుక్రవారం తన ప్రియురాలు స్వాతి అస్థానను నవదీప్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికే భారత జట్టులో ఈ సంవత్సరం కెఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ అనే ఆటగాళ్లు పెళ్లి చేసుకున్నారు. నవదీప్ షైనీ వివాహ వేడుకకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.”ప్రతి రోజు నీ ప్రేమతో నిండిపోయాను.. ఈ రోజు ప్రేమను శాశ్వతం చేస్తున్నా.. తమ జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న శుభ సమయంలో మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కోరుతున్నాం అని” నవదీప్ షైనీ క్యాప్షన్ రాశాడు. నవదీప్, స్వాతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. స్వాతి వ్లాగర్, ఫ్యాషన్, ట్రావెల్, లైప్ స్టైయిల్ గురించి ఆన్‌లైన్‌లో వీడియో పెడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News