Wednesday, January 22, 2025

ఎస్బిఐ లైఫ్ స్పెల్ బీ సీజన్ 13 టైటిల్‌ను గెలుచుకున్న రాయన్ నవీద్ సిద్ధిఖీ

- Advertisement -
- Advertisement -

ముంబై: మిర్చి కార్యక్రమం, భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన స్పెల్లింగ్ పోటీ, ఎస్బిఐ లైఫ్ స్పెల్ బీ సీజన్ 13, ముంబైలో ఉత్కంఠభరితంగా జరిగిన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. ఎస్బిఐ లైఫ్ స్పెల్ బీ సీజన్ 13, ఛాంపియన్‌గా ముంబైకి చెందిన బాంబే స్కాటిష్ స్కూల్, మహిమ్లో ఎనిమిదవ తరగతి విద్యార్థి , 13 సంవత్సరాల వయస్సు కలిగిన రేయాన్ నవీద్ సిద్ధిఖీ, ‘స్పెల్ మాస్టర్ ఆఫ్ ఇండియా’, జాతీయ టైటిల్‌ను గెలుచుకున్నాడు. మొదటి రన్నరప్ గా బాంబే స్కాటిష్ స్కూల్, మహిమ్ లో ఎనిమిదవ తరగతి విద్యార్థి, 13 సంవత్సరాల వయస్సు కలిగిన ఆదితా నాగ్, నిలవడం తో పాటుగా గ్రాండ్ ఫినాలేలో ప్రశంసనీయమైన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. సంక్లిష్టమైన పదాలను ఖచ్చితత్వంతో, విశ్వాసంతో నావిగేట్ చేయగల ఈ యువ మేధస్సుల సామర్థ్యం వారిని అర్హులైన విజేతలుగా నిలిపింది. ఉత్సాహం, ఆసక్తితో నిండిన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం జాతీయ ఛాంపియన్, ప్రకటన, సన్మానానికి సాక్షిగా నిలిచింది, పోటీ అంతటా అభ్యర్థుల అద్భుతమైన ప్రదర్శన అసాధారణమైన నైపుణ్యం, అంకితభావం, భాషపై ప్రగాఢమైన ప్రేమను ప్రదర్శించింది.

ఈ కార్యక్రమంలో భారతీయ నటి, ఫ్యాషన్ డిజైనర్ & టెలివిజన్ ప్రెజెంటర్, మందిరా బేడీ, ఎస్బిఐ లైఫ్ స్పెల్ బీ సీజన్ 13 గ్రాండ్ ఫినాలేను ఉత్సాహంగా నిర్వహించి విజేతలను వెల్లడించారు. ప్రతిష్టాత్మకమైన ఎస్బిఐ లైఫ్ స్పెల్ బీ సీజన్ 13 యొక్క నేషనల్ ఛాంపియన్‌కు రూ.100,000 బహుమతి లభించింది, దానితో పాటు తల్లిదండ్రులతో కలిసి డిస్నీల్యాండ్, హాంకాంగ్‌కు అన్ని ఖర్చులు-చెల్లించిన యాత్ర చేసే అవకాశం కూడా లభించింది.

ఈ సంవత్సరం ఈ పోటీ నేపథ్యం, “ప్రగతి చూపే కార్యక్రమం”. భారతదేశ యువ జనాభా వృద్ధి అవకాశాలను పెంపొందించడానికి ఎస్బిఐ లైఫ్ యొక్క నిబద్ధతను ఇది సూచిస్తుంది. వ్యక్తులు తమ కలలను సాధించడంలో సహాయం చేయడానికి అంకితమైన సంస్థగా, ఎస్బిఐ లైఫ్ నిజమైన పురోగతి అకడమిక్ విజయానికి మించినదని గుర్తించింది. సంపూర్ణ అభివృద్ధి ద్వారా మాత్రమే సాధ్యమని నమ్ముతుంది. ఈ థీమ్ బ్రాండ్ యొక్క ప్రధాన విలువలకు అనుగుణంగా ఉంటుంది, యువకులకు అవకాశాలను అన్వేషించడానికి, వారి వృద్ధి కథనాన్ని రూపొందించడానికి, తద్వారా దేశ ప్రగతికి దోహదపడటానికి వేదికను అందించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.ఎస్బిఐ లైఫ్ స్పెల్ బీ సీజన్ 13 మరోసారి జ్ఞానం ప్రాముఖ్యత, భాషా నైపుణ్యం, యువ మనస్సులను పెంపొందించడంలో విద్యా కార్యక్రమాల యొక్క అమూల్యమైన పాత్రను హైలైట్ చేసింది.

ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో బ్రాండ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, సీఎస్ఆర్ చీఫ్, రవీంద్ర శర్మ, భాగస్వామ్యం విజయం గురించి మాట్లాడుతూ.. “స్పెల్ బీ మరొక అధ్యాయం ముగిసిన వేళ, విజేతలతో సహా ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఎస్బిఐ లైఫ్ అభినందిస్తుంది. ఎస్బిఐ లైఫ్‌లో, ప్రతి వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడంలో మా అచంచలమైన నిబద్ధత మా విలువలలో లోతుగా పాతుకుపోయింది. ప్రారంభ అవకాశాల పరివర్తన శక్తిని మేము విశ్వసిస్తున్నాము, ఎందుకంటే అవి జీవితకాల అర్ధవంతమైన ప్రభావానికి పునాది వేస్తాయి. ప్రతి బిడ్డ ప్రత్యేక సామర్థ్యాలను కలిగి ఉంటుంది, సరైన సాధనాలు ప్లాట్‌ఫారమ్‌లను అందించడం ద్వారా, నిరంతర అభ్యాసం, అభివృద్ధిని ప్రోత్సహించే వాతావరణాన్ని పెంపొందించాలని మేము కోరుకుంటున్నాము” అని అన్నారు.

“స్పెల్ బీతో మా భాగస్వామ్యం ‘స్పెల్ మాస్టర్ ఆఫ్ ఇండియా’ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఇది యువ మేధస్సులను శక్తివంతం చేయడంలో మా అంకితభావాన్ని సూచిస్తుంది, వారికి జాతీయ వేదికపై ప్రకాశించే అవకాశాన్ని అందిస్తుంది. పిల్లలు మన దేశ భవిష్యత్తుకు రూపశిల్పులు, వారి విద్యా ప్రయాణానికి మద్దతు ఇవ్వడం పట్ల మేము గర్వపడుతున్నాము. రాబోయే సంవత్సరాల్లో యువత ఆకాంక్షలు, ఆశయాలను రూపొందించడంలో, నిరంతర మద్దతు యొక్క వారసత్వాన్ని సృష్టించడంలో తోడ్పడాలని మా ఆశ. మన గొప్ప దేశం పురోగతి, శ్రేయస్సుకు నిస్సందేహంగా దోహదపడే భావి పౌరులను రూపొందించడంలో మా వంతు కృషి చేయడంపై దృష్టి పెట్టాలనే లక్ష్యంతో మేము ఉత్సాహంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించాము” అన్నారాయన.

తాను సాధించిన విజయం పై మాస్టర్ రాయన్ సిద్ధిఖీ మాట్లాడుతూ, “ఎస్బిఐ లైఫ్ స్పెల్ బీ సీజన్ 13 విజయం కోసం ప్రయాణం చాలా కష్టంగా జరిగినప్పటికీ , గ్రాండ్ ఫినాలేలో గెలిచిన తర్వాత పొందిన ఆనందాన్ని నేను స్పష్టంగా గుర్తుంచుకున్నాను! రీజినల్ ఫైనల్‌లో గెలిచినప్పుడు, తొలిసారిగా నేషనల్ ఫైనల్‌లో గెలిచి దేశానికి తన సత్తాను నిరూపించుకోవాలనే కోరికను రేకెత్తించింది. దీనికోసమై అభ్యాసం చేసాను, స్టడీ గైడ్‌ను వెదికాను, కష్టమైన పదాల కోసం శోధించాను. నిఘంటువును చూసాను, వ్యాకరణం, స్పెల్లింగ్ గురించి అనేక పుస్తకాలు చదివాను. చాలా సంవత్సరాలుగా నా స్కూల్ స్పెల్ బీ పోటీలు స్టేజ్ ఒత్తిడిని నిర్వహించడానికి బాగా తీర్చిదిద్దాయి. ఎస్బిఐ లైఫ్ స్పెల్ బీ చాలా పద్దతిగా ప్లాన్ చేసిన, సవాలుతో కూడిన పోటీ. క్రీడాస్ఫూర్తి తో వ్యవహరించిన ప్రేక్షకులతో అనుభవం అద్భుతంగా ఉంది. ‘స్పెల్ మాస్టర్ ఆఫ్ ఇండియా’ టైటిల్ గెలవడం తో కల నిజమైంది! మొత్తంమీద, అనుభవం సూపర్‌కాలిఫ్రాగిలిస్టిక్ ఎక్స్‌పియాలిడోషియస్‌గా ఉంది!” అని అన్నాడు

ఎంట‌ర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & నేషనల్ ఐపి డైరెక్టర్ శ్రీమతి పూజా గులాటి ఈ కార్యక్రమంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. “విలువను జోడించి వినియోగదారులకు, వారి కుటుంబాలకు సాధికారత కల్పించే వినియోగదారు-కేంద్రీకృత ప్రాపర్టీలను రూపొందించడంలో మిర్చి ఎప్పుడూ గర్వపడుతోంది. వ్యూహాత్మకంగా, మిర్చి తన అనుభవపూర్వక ప్రభావ ప్రాపర్టీల పోర్ట్‌ఫోలియోను నిర్మించింది. ఆ దిశగా స్పెల్ బీ ప్రారంభించినది ఈ ఫ్లాగ్‌షిప్ ప్రాపర్టీ. మిర్చి, ఎస్బిఐ లైఫ్ భారతదేశంలోని పాఠశాల పిల్లలకు వారి లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి ఉమ్మడి దృష్టిని పంచుకుంటున్నాయి. ఈ దిశగా లక్ష్య సాధనలో స్పెల్లింగ్ మాధ్యమం ఒక మెట్టు వంటిది. ఇది పాఠశాలల కోసం భారతదేశం అతిపెద్ద స్పెల్లింగ్ పోటీ, అత్యున్నత స్థాయిలో ఆంగ్ల భాషా విద్యను ప్రోత్సహిస్తుంది. దాని 13వ సీజన్‌లో, ఈ సంవత్సరం బ్రాండ్-న్యూ ఫార్మాట్‌తో గణనీయంగా ఈ ప్రొపర్టీ వృద్ధి చెందింది. స్పెల్ బీ పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నుండి అసమానమైన ప్రేమను అందుకుంటుంది, ఇది ఈ ప్రాపెర్టీ ని ప్రత్యేకంగా చేస్తుంది. ఈ సంవత్సరం, పోటీ మరింతగా విస్తరించింది. 30 నగరాల్లోని పాఠశాలల తో పాటుగా ఆన్‌లైన్ భాగస్వామ్యంతో భాగస్వామ్యాన్ని పొందింది. గత సంవత్సరాల్లో మాదిరిగానే, విద్యార్థులు తమ నైపుణ్యాలను జాతీయ వేదికపై ప్రదర్శించడానికి, రాబోయే సీజన్‌కు సిద్ధమయ్యేలా ప్రోత్సహించడానికి ఈ పోటీ టెలివిజన్ లో ప్రసారం చేయబడుతుంది” అని అన్నారు.

ఈ సీజన్‌లో 30 నగరాల్లోని 350+ పాఠశాలల్లో 1,50,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు, ఇది ఐదు అంచెలలో విస్తరించిన బహుముఖ పోటీగా జరిగింది. ఈ పోటీలు పాఠశాలల మధ్య పోటీలతో ప్రారంభమయ్యాయి, తర్వాత అంతర్ పాఠశాల పోటీలు జరిగాయి. నగర-స్థాయి, ప్రాంతీయ ముగింపుల ద్వారా ముందుకు సాగుతూ, మొదటి 75 మంది పార్టిసిపెంట్‌లు నేషనల్ ఫైనల్‌కు చేరుకున్నారు. డిస్నీ, హంగామా, సూపర్ హంగామాలో ఏకకాలంలో ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News