Wednesday, January 22, 2025

రష్యా దాడుల్లో భారతీయ వైద్య విద్యార్థి నవీన్ దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Naveen, an Indian medical student, was killed in Russian airstrike

ఉక్రెయిన్‌లో నాలుగో సంవత్సరం మెడిసిన్ చదువుతున్న నవీన్ కర్నాటక హావేరీ జిల్లాకు చెందినవాడిగా గుర్తింపు
నవీన్ కుటుంబానికి ఫోన్‌లో ప్రధాని మోడీ పరామర్శ

కీవ్ : ఉక్రెయిన్ లోని ఖర్కీవ్‌లో మంగళవారం ఉద యం రష్యా జరిపిన వైమానిక దాడుల్లో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు కర్ణా టకలోని హావేరీ జిల్లాకు చెందిన నవీన్‌గా గుర్తిం చారు. విద్యార్థి కుటుంబానికి సమాచారం ఇచ్చి నట్టు ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ ట్విట్టర్‌లో వెల్లడించా రు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నవీన్ మృతదేహాన్ని రప్పించేదుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యార్థి నవీన్ ఉక్రె యిన్‌లో వైద్య విద్య నాలుగో సంవత్సరం చదువు తున్నాడు. ఖర్కీవ్‌లోన గవర్నర్ ఆఫీస్ పక్కన ఉండే అపార్ట్‌మెంట్లోనే నవీన్ స్నేహితులతో కలిసి ఉంటు న్నాడు. రష్యా దాడుల నేపథ్యంలో స్నేహి తులతో కలిసి నవీన్ దగ్గరర్లోని బంకర్‌లో ఉంటు న్నాడు. మంగళవారం ఉదయం నవీన్ కర్నాటక లో ఉన్న తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడారని కుటుంబ సభ్యులు తెలిపారు. బంకర్‌లో భోజనం,

నిత్యవసరాల కొనుగోలుకు బయటికి వచ్చి బలి
నవీన్ కుటుంబానికి ప్రధాని మోడీ ఫోన్, పరామర్శ

నీళ్లు అయిపోయాయని చెప్పాడన్నారు. ఉదయం కరెన్సీ మార్చుకుని దగ్గర్లోని గ్రాసరీ స్టోర్‌కు నవీన్ వెళ్లాడు. అక్కడ గవర్నర్ కార్యాలయం పక్కనే ఉన్న ఆ స్టోర్ వద్ద లైన్‌లో నిలబడి ఉన్నాడు. అదే సమ యంలో రష్యా బలగాలు గవర్నర్ ఆఫీసు లక్షం గా దాడులు నిర్వహించాయి. గురితప్పని షెల్ గ్రాసరీ స్టోర్‌పై పడడంతో వాటి శిథిలాలు నవీన్ సహా పలువురిపై పడ్డాయి. దీంతో నవీన్ అక్కడిక క్కడే మృత్యువాతపడ్డాడు. మరోవైపు నవీన్ కుటుం బ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News