Monday, December 23, 2024

సహజత్వానికి దగ్గర వుండే పాత్రలో కనిపిస్తా

- Advertisement -
- Advertisement -

నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం మంత్ ఆఫ్ మధు. దర్శకుడు శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా, యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో హీరో నవీన్ చంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఈ సినిమాలో సహజత్వానికి చాలా దగ్గర వుండే పాత్రలో కనిపిస్తాను.

నా పాత్ర పేరు మధుసూధనరావు. చదువుకున్న రోజుల్లో ఫ్రెండ్స్ అతన్ని హీరోలా చూస్తుంటారు. అయితే కాలం గడిచిన కొద్ది ఎవరి జీవితాల్లోకి వారు వెళ్ళిపోతారు. మధు మాత్రం అదే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండిపోతాడు. మందు, సిగరెట్ కి అలవాటు పడిపోతాడు. ఒకరి కింద ఉద్యోగం చేయాలని వుండదు. తనకి డబ్బు పై కూడ ఆశ లేదు. తనకి ఏ లక్ష్యం వుండదు. ఏ భాద్యత తీసుకోడు.

చిన్నప్పటి నుంచి అందరూ ఒక హీరో ఇమేజ్‌తో చూడటంతో అందులోనే ఉండిపోతాడు. ‘మంత్ ఆఫ్ మధు’ చాలా స్పెషల్ మూవీ. ఇందులో మధుమతి పాత్ర యుఎస్ ఎన్‌ఆర్‌ఐ. తను అక్కడే పుట్టి పెరిగిన అమ్మాయి. స్వాతి తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. ఆ పాత్రలో బాధ ఉంటుంది. ఈ కథ చాలా యూనిక్ గా వుంటుంది. ఈ సినిమాలో పాత్రల ప్రయాణం, వారి ఛాయిస్‌లని చూపించబోతున్నాం”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News