Wednesday, December 25, 2024

‘డెవిల్’ను నవీన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు: అభిషేక్ నామా

- Advertisement -
- Advertisement -

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమాపై నెలకొన్న వివాదంపై ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామా క్లారిటీ ఇచ్చారు. నవీన్ మేడారం చిత్రాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని, దాంతో తానే దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టవలసి వచ్చిందని అభిషేక్ స్పష్టం చేశారు.

ఈ చిత్రానికి తానే దర్శకుడిననీ, అయితే తనకు క్రెడిట్ ఇవ్వకపోవడం బాధగా ఉందనీ నవీన్ మేడారం పేర్కొన్న సంగతి తెలిసిందే. నవీన్ వ్యాఖ్యలపై అభిషేక్ నామా ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పై వివరణ ఇచ్చారు. డెవిల్ మూవీ శుక్రవారం రిలీజ్ అవుతోంది. సంయుక్త కథానాయికగా నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News