Monday, December 23, 2024

నవీన్ హత్య కేసు.. యువతి పాత్రపై రాచకొండ సిపి కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన ప్రియురాలును నవీన్ కూడా ప్రేమిస్తున్నాడని అనుమానించిన హరిహర కృష్ణ పార్టీ పేరుతో పిలిచి అత్యంత దారుణంగా నవీన్ ను హత్య చేసిన విషయం తెలిసిందే. ఆపై నవీన్ శరీర భాగాలను ఒక్కొక్కటి బయటకు తీసి ఫోటోలు తీసి ప్రియురాలికి పంపించాడు. ఎక్కువగా క్రైమ్ సిరీస్ లు చూసిన హరిహర ఒళ్లు గగుర్పొడిచేలా హత్య చేశాడు. ఇక ఈ హత్యపై హారిహార గర్ల్ ఫ్రెండ్ పాత్రపై అనేక అనుమానాలు నెలకొని ఉన్నాయి. అసలు ఆమె ప్రధాన పాత్రధారి అని అనేక ఆరోపణలు వచ్చాయి. ఇటీవల విచారణ సమయంలో ఆమె తీరుపై పోలీసులకు అనుమానం కలిగింది. ఈ క్రమంలో నవీన్ హత్య కేసులో యువతి పాత్రపై రాచకొండ సీపీ చౌహన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ఈ కేసులో యువతికి ఎటువంటి సంబంధం లేదు. కేసు దర్యాప్తులో యువతిపై ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. హరిహరను విచారిస్తున్నామని.. త్వరలోనే మరిన్ని విషయాలు రాబడతామన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న అందరిని కూడా పట్టుకుంటామని’ స్పష్టం చేశారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఈరోజు సీన్ రీ కన్ స్ట్రక్షన్ కూడా పూర్తి చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News