భువనేశ్వర్: అపజయమెరుగని నాయకుడిగా కొనసాగుతున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వరుసగా ఆరువసారి హిన్జిలి అసెంబ్లీ స్థానం నుంచి బిజూ జనతా దళ్(బిజెడి) అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సిక్కిం be/w ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ తర్వాత అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఘనతను నవీన్ పట్నాయక్ సొంతం చేసుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిస్తే పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును నవీన్ పట్నాయక్ అధిగమిస్తారు. 1946 అక్టోబర్ 16న కటక్‌లో ఒడిశౠ మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్, జ్ఞాన్ పట్నాయక్ దంపతులకు జన్మించారు. కటక్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూలులో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. అనంతరం డెహ్రాడూన్‌లోని వెల్హమ్ బాయ్స్ స్కూలులో, డూన్ స్కూలులో చదువుకున్నారు.
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కిరోరీ మల్ కళాశాలలో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. నవీన్ పట్నాయక్ మంచి చిత్రకారుడు. ఆయనకు చరిత్ర, సంస్కృతిఐ ఆసక్తి ఎక్కువ. కుటుంబ రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ మొదట్లో ఆయన రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. 1997లో తండ్రి బిజూ పట్నాయక్ మరణానంతరం ఆయన రాజకీయ ప్రవేశం చేశారు. తొలుత ఒడిశాలోని ఆస్కా స్థానం నుంచి ఉప ఎన్నికలో పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1997 డిసెంబర్ 26న తన తండ్రి పేరిట బిజూ జనతా దళ్(బిజెడి) స్థాపించారు. 2000 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో ఎన్నికల పొత్తు పెట్టుకుని పోటీ చేసిన బిజెడి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది.
దీంతో కేంద్ర క్యాబినెట్‌కు రాజీనామా చేసి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంధమాల్ అల్లర్ల తర్వాత 2009లో ఎన్‌డిఎ నుంచి బిజెడి వైదొలగింది. నాటి నుంచి బిజెడి ఒడిశాలో ప్రధాన పార్టీగా కొనసాగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 146 సీట్లలో 112 సీట్లను బిజెడి గెలుచుకుని ఐదవసారి ముఖవ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ బాధ్యతలు చేపట్టారు. నవీన్ పట్నాయక్ రాజకీయ చతురత గురించి అందరికీ తెలిసినప్పటికీ ఆయన ఒక హాలీవుడ్ చిత్రంలో కూడా నటించారన్న విషయం చాలామందికి తెలియదు. 1988లో ఆ చిత్రం విడుదలైంది. పియర్స్ బ్రాస్నన్ హీరోగా నటించి నికోలస్ మేయర్ దర్శకత్వం వహించిన ది డిసీవర్స్ చిత్రంలో నవీన్ ఒక చిన్న పాత్రలో నటించారు.