Sunday, January 19, 2025

2 స్థానాల నుంచి నవీన్ పట్నాయక్ పోటీ

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: బిజెడి అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గంజాం జిల్లాలోని తన సంప్రదాయ హింజిలి స్థానంలోపాటు బోలంగిర్ జిల్లాలోని కాంతాబంజీ అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేయనున్నారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల కోసం బుధవారం 9 మంది అభ్యర్థులతో ఐదవ జాబితా విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్వయంగా ఈ ప్రకటన చేశారు.

2019 అసెంబ్లీ ఎన్నికలలో కూడా పట్నాయక్ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. హింజిలితోపాటు బర్గర్ జిల్లాలోని బిజేపూర్ అసెంబ్లీ స్థానంలో కూడా ఆయన గెలుపొందారు. అయితే ఆ ఆతర్వాతహింజిలి స్థానాన్ని ఉంచుకుని బీజేపూర్ స్థానానికి రాజీనామా చేశారు. బుధవారం విడుదల చేసిన బిజెడి అభ్యర్థుల జాబితాలో ఆరుగురు మహిళలు ఉండగా పార్టీ ఫిరాయించిన వారు నలుగురు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News