Sunday, December 22, 2024

బిజెడి ఎంపీలకు నవీన్ పట్నాయక్ దిశానిర్దేశం

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలలో బలమైన ప్రతిపక్షంగా పనిచేయాలని బిజెడి అధ్యక్షుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను కోరారు. సోమవారం నాడిక్కడ ఆయన తన రాజ్యసభ ఎంపీలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలకు చెందిన అంశాలను గట్టిగా ప్రశ్నించాలని ఆయన వారిని కోరారు.

సమావేశం అనంతరం రాజ్యసభలో బిజెడి నాయకుడైన సస్మత్ పాత్రా విలేకరులతో మాట్లాడుతూ బజెడి ఎంపీలు ఈసారి రాజ్యసభ సమావేశాలలో అంశాలపై మాట్లాడేందుకే పరిమితమవుతారని చెప్పారు. ఒడిశా ప్రయోజనాలను కేంద్రం విస్మరిస్తే బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంపై పోరాడతామని ఆయన తెలిపారు. ఒడిశాకు ప్రత్యేక హోదా కోసం డిమాండు చేయడంతోపాటు రాష్ట్రంలో మొబైల్ కనెక్టివిటీ తక్కువగా ఉండడం, బ్యాంకు శాఖలు స్వల్పంగా ఉండడం గురించి కూడా ప్రశ్నిస్తామని ఆయన తెలిపారు.

గత పదేళ్లుగా బొగ్గు రాయల్సీని సవరించాలన్న తమ డిమాండును కేంద్రం పట్టించుకోవడం లేదని, తమ న్యాయమైన హక్కును పొందడలేకపోవడంతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని పాత్రా చెప్పారు. తమ పార్టీకి చెందిన 9 మంది రాజ్యసభ సభ్యులు బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తారని, దీనిపై తమ నాయకుడు నవీన్ పట్నాయక్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఆయన చెప్పారు. ఒడిశా ప్రజల హక్కుల కోసం పార్లమెంట్‌లో పోరాడవలసిందిగా తమ నాయకుడు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. గతంలో మాదిరిగా కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతునిచ్చే విధానాన్ని బిజెడి కొనసాగిస్తుందా బిజెపికి ఇక మద్దతిచ్చే ప్రసక్తి లేదని, ఇక తాము ప్రతిపక్షంగానే ఉంటామని, ఒడిశా ప్రజల ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళతామని ఆయన స్పష్టం చేశారు. ఇటీల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజెడి ఒక్క సీటును కూడా ఒడిశాలో గెలుచుకోలేకపోయింది. 1997లో పార్టీని స్థాపించిన తర్వాత ఇలాంటి పరిణామం ఇదే మొదటిసారి.

24 ఏళ్ల పాటు ఒడిశాను పాలించిన బిజెడి అధికారాన్ని కోల్పోయింది. గత కొన్నేళ్లుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి పార్లమెంట్‌లో అనేక అంశాలలో మద్దతు నివ్వడమే గాక 2019, 2024లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభకు ఎన్నిక కావడానికి కూడా బిజెడి మద్దతు ఇచ్చింది. ఇలా ఉండగా..ఆదివారం జరిగిన పార్టీ సినియర్ నాయకుల సమావేశంలో నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ఒడిశా అసెంబ్లీలో బిజెపికి మెజారిటీ కన్నా నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువ ఉన్నాయని, కేంద్రంలో కూడా ఆ పార్టీకి సొంతంగా మెజారిటీ లేదని చెప్పారు. బిజెడి నాయకులు ఐక్యంగా నిలబడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News