Monday, December 23, 2024

తండ్రి సమాధి ఐనా లెక్కచేయని నవీన్ పట్నాయక్

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన తండ్రి, సీనియర్ నేత బిజూ పట్నాయక్ సమాధిని కూడా కూల్చివేయించారు. పుణ్యక్షేత్రం, యాత్రాస్థలం ఒడిషాలోని పూరీ సుందరీకరణ, శ్మశాన వాటికలకు మరింత స్థలం కోసం సిఎం పట్నాయక్ తండ్రి సమాధి సెంటిమెంట్‌ను కూడా పక్కకు పెట్టేశారు. ఈ సంఘటన 2019లో జరిగిందని సిఎం నవీన్ పట్నాయక్ వ్యక్తిగత కార్యదర్శి వికె పాండియన్ తెలిపారు. పాండియన్ నవీన్ పిఎస్‌గా 13 సంవత్సరాల నుంచి విధుల్లో ఉన్నారు. దుబాయ్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన అక్కడి ఒడిషా వారితో మాట్లాడారు.

పూరీలో ఇంతకు ముందటి వరకూ బిజూ స్మారకస్థలి ఉన్న స్వర్గద్వార్ వాటిక వద్ద ఇప్పుడు కేవలం ఆయన పేరు రాసి ఉన్న శిలాఫలకం ఉందని, తండ్రి సమాధి అని కూడా చూడకుండా నవీన్ స్థానిక ప్రజల సౌకర్యం కోసం దీనిని కూల్చివేయించారని తెలిపారు. 1997 ఎప్రిల్ 17న బిజూ మరణం తరువాత అక్కడి శ్మశాన వాటికలో భారీ స్థాయిలో సమాధిని స్థానిక పురపాలక సంఘం నిర్మించింది. అయితే దీని వల్ల శ్మశాన వాటిక ఇరుకు అయిందని అభిప్రాయం వ్యక్తం కావడంతో దీనిని తొలిగించేందుకు సిఎం నిర్ణయం తీసుకున్నారని పిఎస్ చెప్పారు. తన తండ్రి బిజూ ప్రజల హృదయాలలో ఉంటే చాలునని, రాతి సమాధులలో కాదని పట్నాయక్ తనతో చెప్పారని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News