- Advertisement -
భువనేశ్వర్: ఒడిశాలో తిరుగులేని నేతగా వెలుగొందిన నవీన్ పట్నాయక్ ప్రాభవం మసకబారుతున్నట్లు కనబడుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఒడిశాలో బిజెపి బలమైన శక్తిగా ఎదుగుతోంది. మధ్యాహ్నం వరకు వచ్చిన ఫలితాల్లో బిజెపి మొదటి సారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఐదు సార్లు అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ ఇప్పుడు కేవలం 53 స్థానాలకే పరిమితం కాబోతోంది.
ఒడిశాలో కాంగ్రెస్ మునుపటి కన్నా కాస్త మెరుగుపడింది. కానీ ఆ రాష్ట్ర ఓటర్లు బిజెపికే పట్టం కట్టబోతున్నారు. బిజెపి కి అంశాల వారీగా మద్దతు ఇస్తూ వచ్చిన నవీన్ పట్నాయక్ చివరికి గ్రహణం పట్టిన చంద్రుడే అవ్వబోతున్నారు.
ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 147 సభ్యులున్న అసెంబ్లీలో 74 సీట్లు గెలవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అందిన డేటా ప్రకారం బిజెపి 73 అసెంబ్లీ సీట్లలో ఆధిక్యతతో ఉంది.
- Advertisement -