Wednesday, January 22, 2025

నవీన్ పట్నాయక్‌కు అఖండ స్వాగతం

- Advertisement -
- Advertisement -

Naveen Patnaik Receives Grand Welcome in Bhubaneswar

భువనేశ్వర్: ఢిల్లీకి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకుని మంగళవారం భువనేశ్వర్‌కు తిరిగివచ్చిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు అధికార బిజూ జనతా దళ్ కార్యకర్తలు, మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. నవీన్ పట్నాయక్ ఫోటోలతో కూడిన ప్లకార్డులు ధరించి 50 వేల మందికి పైగా అభిమానులు విమానాశ్రయానికి దారితీసే మార్గం వెంబడి బారులు తీరడంతో విమానాశ్రయానికి వెళ్లే, వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే మార్గంలో భువనేశ్వర్ రైల్వే స్టేషన్ కూడా ఉండడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. పట్నాయక్ విమానాశ్రయం నుంచి బయటకు రాగానే జానపద కళాకారులు, గిరిజన నృత్యకారులు, సాంస్కృతిక బృందాలు తమ ఆటపాటలతో ఆయనకు స్వాగతం పలికారు. బిజెడి ఎన్నికల చిహ్నమైన శంఖాన్ని పూరించి కళాకారులు ఆయనకు అభివాదం చేశారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక హైటెక్ బస్సులో తన అధికారి నివాసం నవీన్ నివాస్‌కు బయల్దేరిన పట్నాయక్‌కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.

Naveen Patnaik Receives Grand Welcome in Bhubaneswar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News