Tuesday, January 21, 2025

బ్యూటిఫుల్ జర్నీలా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’..

- Advertisement -
- Advertisement -

హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్‌బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈనెల 7న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ మీడియాతో క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ట్రైలర్‌కు వచ్చిన అద్భుతమైన స్పందనను చూసి మాకు సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది. మేము సినిమాలో చెప్పబోతున్న పాయింట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అనిపించింది. కృష్ణాష్టమి రోజు మా మూవీ రిలీజ్ అవుతుంది. కృష్ణుడు ఎలా అల్లరి చేస్తాడో, ఈ సినిమా కూడా అంతే అల్లరిగా ఉంటుంది.

జాతి రత్నాలు మూవీ చేసిన తర్వాత చాలా కథలు విన్నాను. దర్శకుడు మహేశ్ ఈ కథ చెప్పినప్పుడు ఆ ట్రాన్స్‌లో కొద్ది సేపు ఉండిపోయా. అంత మంచి కథ ఇది. క్యారెక్టర్స్‌కు మంచి బలం ఉంటుంది. సినిమాలో మంచి ఎమోషన్స్ ఉంటాయి. పర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉంది. సినిమాలో క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. అనుష్కతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. తెలుగు ఆడియన్స్‌కు స్టాండప్ కామెడీని పరిచయం చేయాలని ప్రయత్నం చేశాం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌లో ఒక కొత్త యాంగిల్ ఈ సినిమాలో ఉంటుంది”అని అన్నారు. దర్శకుడు పి.మహేశ్ బాబు మాట్లాడుతూ “సినిమా ట్రైలర్‌లో చూసింది 30 శాతం అనుకుంటే సినిమాలో 70 శాతం ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. మూవీ అంతా ఒక బ్యూటిఫుల్ జర్నీ అనిపిస్తుంది”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News