Wednesday, January 22, 2025

యువతిని కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డి అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : వందమంది యువకులు దాడి చేసి యువతిని కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నవీన్ రెడ్డితో పాటు ఉన్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంటిపై దాడి చేసి యువతిని కిడ్నాప్ చేసిన సంఘటన ఒక్కసారిగా సంచలనం సృష్టించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీస్ బృందాలను రంగంలోకి దింపారు. రంగారెడ్డి జిల్లా, ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో ఉంటున్న దామోదర్ రెడ్డి, నిర్మల దంపతుల కుమార్తె వైశాలి డెంటిస్ట్‌గా ప్రాక్టిస్ చేస్తోంది. వీరి ఇంటి సమీపంలోనే నవీన్ రెడ్డి భూమిని లీజ్‌కు తీసుకుని మిస్టర్ టీ స్టాల్ నిర్వహిస్తున్నాడు.

నవీన్ రెడ్డికి వైశాలితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. కొద్ది రోజుల క్రితం నవీన్ రెడ్డి తాను వైశాలిని వివాహం చేసుకుంటానని దామోదర్‌రెడ్డిని సంప్రదించాడు. ఇద్దరికి వివాహం చేసేందుకు వారు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే వైశాలిని వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చేసేందుకు నిర్ణయించారు. శుక్రవారం వైశాలికి పెళ్లి చూపులు ఉన్నాయి. దీంతో నవీన్‌రెడ్డి 100మందితో వచ్చి వైశాలీని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లాడు. అడ్డు వచ్చిన దామోదర్‌రెడ్డిపై దాడి చేసి తీసుకుని వెళ్లారు. ఇది కిడ్నాప్ కేసుగా అందరూ భావిస్తుండగా సాయంత్రం వరకు వైశాలీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను సేఫ్‌గా ఉన్నానని, హైదరాబాద్‌లో ఉన్నానని చెప్పింది. దీంతో కిడ్నాప్ కథ ఒక్కరిగా మలుపు తిరిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News