Sunday, December 22, 2024

నిన్న జరిగింది కాదు.. మొదట నుండి జరిగింది ఏంటో తెలుసుకోండి: నవీన్ రెడ్డి తల్లి

- Advertisement -
- Advertisement -

రాచకొండ: రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిదిలో చోటుచేసుకున్న యువతి కిడ్నాప్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నవీన్ రెడ్డి అనే వ్యక్తి, 50మందికి పైగా యువకులతో అమ్మాయి ఇంట్లోకి చొరబడి కిడ్నాప్ చేసిన ఘటనపై అతని తల్లి స్పందించింది. ఈ సందర్భంగా నవీన్ రెడ్డి తల్లి మాట్లాడుతూ.. ”ఇద్దరు చాల రోజుల నుండి కలిసి తిరిగారు. ఆ అమ్మాయి కళాశాలకు 100 సార్లకు పైగా పోయాడు. నా కొడుకు, ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నానని కూడా నాతో చెప్పాడు.

నిన్న జరిగింది కాదు…మొదట నుండి జరిగింది ఏంటో తెలుసుకోండి” అని మిడియా ముందు వెడుకుంది. ఈ క్రమంలో బిపి పెరగడంతో మాట్లాడుతుండగానే నవీన్ రెడ్డి తల్లి కిందపడిపోయింది. దీంతో ఆమెను వెంటనే చికిత్స కోసం దావఖానాకు తరలించారు. మరోవైపు, కిడ్నాపైనా యవతి వైశాలి.. నవీన్ రెడ్డి తనకు ఫ్రెండ్ మాత్రమే అని, ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తనను పెళ్లిచేసుకోమని వెంటపడ్డాడని చెప్పుకొచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News