Wednesday, January 22, 2025

నవీన్ హత్య కేసు.. హరిహరకృష్ణ స్నేహితుడు, ప్రియురాలి అరెస్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసులో మరో ఇద్దరిని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అరెస్టు చేశా రు. నిందితుడు హరిహరకృష్ణకు సహకరించినస్నేహితుడు హసన్, ప్రియురాలు ని రికరెడ్డిలను అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులను జడ్జి ముందుకు హాజరు పర్చగా 14 రోజులు రిమాండ్ విధించారు. హసన్‌ని చర్లపల్లి, నిహారికను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎల్‌బినగర్ డిసిపి సాయిశ్రీ సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూలు జి ల్లా, చారకొండ మండలం, శిరిషనగండ్ల గ్రా మానికి చెందిన నేనావత్ నవీన్ నల్గొండ జి ల్లాలోని ఎంజి యూనివర్సిటీలో ఇంజినీరిం గ్ చేస్తున్నాడు. గత నెల 18వ తేదీన నవీన్ నగర శివారులో హత్యకు గురయ్యాడు. నవీన్‌ను హత్య చేసిన అతడి స్నేహితుడు హరిహరకృష్ణను అరెస్టు చేసిన పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా పలు విషయాలు బ యటికి వచ్చాయి. ప్రేమించిన యువతి కోస మే నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేసినట్లు వెల్లడైంది.

కస్టడీలో నిందితుడు చెప్పిన వివరాలు ఆధారంగా కట్టా నిహారిక, హరి స్నేహితుడు హసన్‌ను అరెస్టు చేశారు. ఏ2గా హస న్, ఎ3గా నిహారిక పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. నవీన్‌ను హత్య చేసిన హరిహరకృష్ణ తల, గుండె, చేతి వేళ్లు, మర్మాంగాలను శరీరం నుంచి వేరు చేశాడు. వాటిని సం చిలో వేసుకుని బైక్‌పై బ్రాహ్మణపల్లిలోని స్నే హితుడు హసన్ ఇం టికి వెళ్లాడు. నవీన్ హ త్య చేసిన విషయం హసన్‌కు చెప్పడంతో ఇద్దరు కలిసి అవయవాలను తీసుకుని మన్నెగూడ పరిసరాల్లో పడేశారు. అక్కడి నుంచి తిరిగి హసన్ ఇంటికి వచ్చి దుస్తులను మా ర్చుకుని రాత్రి అక్కడే ఉన్నాడు. మరుసటి రో జు 18వ తేదీ ఉదయం బిఎన్ రెడ్డి నగర్‌లో ఉండే ప్రియురాలు కట్టా నిహారిక ఇంటికి వెళ్లాడు. ఆమెకు నవీన్ హత్య చేసిన విష యం చెప్పి, ఖర్చుల కోసం రూ.1,500 తీసుకుని వెళ్లిపోయాడు. తర్వాత ఫోన్‌లో హసన్, నిహారికతో పలుమార్లు మాట్లాడాడు.

గత నెల 20వ తేదీన మళ్లీ నిహారిక వద్దకు వచ్చిన హరి ఆమెను బైక్ ఎక్కించుకుని నవీన్‌ను హత్య చేసిన ప్రాంతానికి తీసుకుని వెళ్లి, దూరం నుంచి మృతదేహాన్ని చూపించాడు. తర్వాత ఆమెను ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి గత నెల 23వ తేదీన హరిహరకృష్ణ వరంరగల్‌లోని తండ్రి వద్దకు వెళ్లా డు. నవీన్ కన్పించకుండా పోయిన కేసులో పోలీసులు అప్పటికే హరి కోసం గాలిస్తున్నారని అతడి తండ్రికి తెలియడంతో వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోరాడు. దీంతో మళ్లీ గత నెల 24వ తేదీన హైదరాబాద్‌కు వచ్చిన హరి తన స్నేహితు డు హసన్‌ను కలిశాడు. ఇద్దరు కలిసి గతం లో నవీన్ అవయవాలను పడేసిన మన్నెగూడకు వెళ్లారు. పడేసిన శరీర అవయవాలను తీసుకుని హత్య చేసిన ప్రాంతానికి వచ్చి తగులబెట్టారు. నిహారిక ఇంటికి వెళ్లి ఇద్దరు స్నానం చేశారు. అక్కడి నుంచి బయలుదేరిన హరిహరకృష్ణ నేరుగా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

పట్టుబడకుండా ప్లాన్…

ముగ్గురు నిందితులు కలిసి నవీన్ హత్య కేసులో పోలీసులకు పట్టుబడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నవీన్ హత్య విష యం తెలిసినా కూడా నిహారిక, హసన్ తమ స్నేహితులు, బంధువులు ఎవరికీ చెప్పలేదు. ముగ్గురు తరచూ ఛాటింగ్ చేసుకున్న హిస్ట రీ, కాల్స్‌ను ముగ్గురు నిందితులు డిలిట్ చే శారు. ప్రధాన నిందితుడు హరిహరకృష్ణకు స్నేహితుడు హసన్ ప్రతి విషయంలో సహకరించాడు. అవయవాలు మాయం చేసే విష యం నుంచి తగలబెట్టే వరకు పూర్తిగా సహకరించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News