Monday, December 23, 2024

పాండియన్‌పై విమర్శలకు నవీన్ స్పందన

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన వీకే పాండియన్‌పై ఇతర పార్టీలు చేసిన తీవ్ర విమర్శలకు బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్ స్పందించారు. “ విద్య, వైద్యం, క్రీడా రంగాలతోపాటు ఆలయాల పునరుద్ధరణ వంటి కార్యక్రమాల కోసం తన సేవలు అందించి సహకరించారు. పాండియన్ బీజేడీలో చేరినప్పటికీ, ఆయనకు ఎలాంటి పదవి లేదు. నా వారసుడు ఎవరని అడిగిన ప్రతిసారీ పాండియన్ కాదని చెప్పాను. ఇదే విషయం మళ్లీ చెప్తున్నాను. ఒడిశా ప్రజలే నా వారసుడిని నిర్ణయిస్తారు.” అని నవీన్ స్పష్టం చేశారు.

అలాగే సైక్లోన్లు , కొవిడ్ సమయంలో ఆయన అద్భుతమైన పనితీరు చూపారని కొనియాడారు. ఆయన ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తి అని, అందుకు ఆయనను గౌరవించాలన్నారు. చాలా కాలం తరువాత ఓటమిని ఎదురు చూసిన తమ పార్టీ, ప్రజల తీర్పును గౌరవిస్తుందన్నారు. 4.5 కోట్ల మంది ఒడిశా ప్రజలు తన కుటుంబమని, అధికారం లేకపోయినా వారికి అందుబాటులోఉంటానని చెప్పారు.

ఇదిలా ఉంటే ఇటీవల ఎన్నికల ఫలితాల్లో బీజేడీని ఓడించి బీజేపీ విజయాన్ని దక్కించుకుంది. అప్పటినుంచి పాండియన్ మీడియా నుంచి అదృశ్యమై పోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆయన ఎవరికీ అందుబాటులో లేకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా బీజేడీచీఫ్ ఎక్కడికి వెళ్లినా ఆయనను వెన్నంటే ఉంటారనే పేరుంది. అయితే ఇటీవల పలు సందర్భాల్లో నవీన్ వెంట ఆయన కనిపించక పోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News