Thursday, January 23, 2025

అశ్లీల దుస్తులు ధరించిన బార్ సింగర్లపై కేసు

- Advertisement -
- Advertisement -

థాణె: అశ్లీల దుస్తులు ధరించడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై నవీ ముంబై పోలీసులు ఒక బార్‌కు చెందిన మహిళా ఉద్యోగినులతోసహా 43 మందిపై కేసు నమోదు చేశారు. నిందితులలో కస్టమర్లు కూడా ఉన్నారని శుక్రవారం ఒక పోలీసు అధికారి తెలిపారు.

కోపర్‌ఖైరానె ప్రాంతంలో ఉన్న ఒక బార్ అండ్ రెస్టారెంట్‌పై బుధవారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. బార్‌లో పనిచేసే మహిళా సింగర్లు, మహిళా వెయిటర్లు పొట్టి దుస్తులు, శరీరం కనిపించే విధమైన దుస్తులు వేసుకుని కనిపించారని ఆ అధికారి చెప్పారు. అనుమతికి మించి మహిళా సింగర్లు ఎక్కువ మందిని బార్ యాజమాన్యం నియమించుకుందని గుర్తించినట్లు ఆయన తెలిపారు. బార్ యజమాని, సిబ్బంది, కస్టమర్లతోసహా 43 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News