జైలులో మొదటి రాత్రి గడిపిన నవజోత్ సింగ్ సిద్ధూ
చండీగఢ్: పంజాబ్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సిద్ధూకు సుప్రీంకోర్టు 34 ఏళ్ల కిందటి ఓ రోడ్ రేజ్ కేసులో ఏడాది జైలు శిక్ష ఇటీవల విధించింది. సిద్ధూ తన కేసును రివిజన్ చేసేందుకు పిటిషన్ కూడా పెట్టుకున్నాడు. దానికి కోర్టు ఇది 33 ఏళ్ల కిందటి కేసు దీనిపై మళ్లీ విచారణ జరపడం జరగదని తెలిపింది. దాంతో సిద్ధూ చేసేది లేక తాను సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తానని చెప్పక తప్పింది కాదు. ఇక జైలులో ఖైదీలను వారి పేర్లతో కాక ఖైదీ నంబరుతో పిలవబడుతుంటారు. ఇప్పుడు నవజోత్ సింగ్ సిద్ధూకు ఖైదీ నంబర్ 241383 స్థిరపడింది. జైలులో అతడు చేసే పనికి రోజూ రూ. 30 మొదలుకుని 90 వరకు లభిస్తాయి. జైలులో అతడికి 10 x 15 గది ఇచ్చారు. అతడుండే బారెక్స్‌లో అతడితోపాటు మరో నలుగురు ఖైదీలు కూడా ఉంటారు. వారిలో ఇద్దరు ఇదివరకటి పోలీసులు కాగా, మిగతా ఇద్దరు సామాన్యులు. సెంట్రల్ జైలు బ్యారెక్ నం. 10లో ఆయన ఉంటున్నారు. జైలులో రాత్రి కాస్త అనీజీగా సిద్ధూ గడిపాడని తెలుస్తోంది. సిద్ధూ వారంలో రెండు రోజులు మాత్రమే తన కుటుంబస్థులు, అభిమానులను కలుసుకునే వీలుంటుంది. జైలు నియమానుసారం ఖైదీలు మంగళవారం, శుక్రవారం మాత్రమే తమకు కావలసిన వారిని కలుసుకునే వీలుంటుంది. ఇదిలావుండగా జైలులో సిద్ధూ రొట్టె, పప్పు తినడానికి నిరాకరించారని కథనం.
रोडरेज केस में पटियाला सेंट्रल जेल में बंद नवजोत सिद्धू ने जेल में दाल रोटी खाने से इनकार कर दिया https://t.co/KL46CKRBFE
— AajTak (@aajtak) May 21, 2022