- Advertisement -
ఛండీగఢ్: కాంగ్రెస్ మాజీ చీఫ్, క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ ఓ రోడ్ రేజ్ కేసులో ఏడాది జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే ఆయన జైలులో 6 నెలల్లోనే 34 కిలోలు తగ్గిపోయారు. ఆయన బరువు అంతగా తగ్గిపోడానికి కారణం ఆయన జైలులో అనుసరిస్తున్న రెండు గంటల యోగ, ఎక్ససైజ్, రెండు నుంచి నాలుగు గంటలపాటు పఠనం, నాలుగు గంటల నిద్ర, నాలుగు గంటల ధ్యానం(మెడిటేషన్) అని ఆయన సహాయకుడు, మాజీ ఎంఎల్‌ఏ నవతేజ్ చీమా తెలిపారు. ప్రస్తుతం సిద్ధూ పాటియాలా సెంట్రల్ జైలులో ఆరు నెలలుగా శిక్ష అనుభవిస్తున్నాడు. 1980 నుంచి 1990 దశకం వరకు ప్రముఖ క్రికెటర్‌గా ఆయన కొనసాగిన విషయం తెలిసిందే. సిద్ధూ 6 అడుగుల 2 అంగుళాల ఎత్తుంటాడు. ప్రస్తుతం ఆయన బరువు 99 కిలోలు. ఆయన 1988 జరిగిన రోడ్ రేజ్ కేసులో సంవత్సరం జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.
- Advertisement -