Sunday, February 23, 2025

లొంగిపోయేందుకు కొంత సమయం కావాలి: సిద్ధూ

- Advertisement -
- Advertisement -

Navjot Singh Sidhu seeks more time to surrender

హైదరాబాద్: రోడ్డు ప్రమాద కేసులో సుప్రీంకోర్టు తనను దోషీగా తేల్చిన నేపథ్యంలో లొంగిపోయేందుకు కొంత సమయం కావాలని టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, లాయర్ ద్వారా కోర్టుకు తెలిపాడు. 1988 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసుపై అత్యున్నత ధర్మాసనం గురువారం తీర్పు వెల్లడిస్తూ సిద్ధూకు ఏడాదిపాటు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్ధూ లొంగిపోయేందుకు తనకు కొంత స‌మ‌యం కావాలని కోరారు. 34 ఏళ్ల త‌ర్వాత ఇది జ‌రుగుతోంద‌ని, వైద్య సంబంధిత ఏర్పాట్ల‌ను చేసుకోవాల‌ని.. లొంగిపోయేందుకు కొన్ని వారాల స‌మ‌యం కావాల‌ని సిద్దూ త‌ర‌పున లాయ‌ర్ అభిషేక్ మ‌నూ సింఘ్వీ కోర్టును తెలిపారు.

Navjot Singh Sidhu seeks more time to surrender

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News