Monday, December 23, 2024

దమ్ముంటే ఆ ఒక్క సీటే ఎంచుకో… సిద్ధూ సవాల్

- Advertisement -
- Advertisement -

Navjot Singh Sidhu vs Bikram Singh Majithia

చండీగఢ్ : శిరోమణి అకాలీదళ్ నేత బిక్రం సింగ్ మజిథియాకు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ సవాలు విసిరారు. రెండు సీట్లో కాకుండా దమ్ముంటే అమృత్‌సర్ ఈస్ట్ నియోజక వర్గంలో మాత్రమే తనపై పోటీ చేయాలని బిక్రం సింగ్‌కు ఆయన సవాలు విసిరారు. మజిథియాను అమృత్ సర్ ఈస్ట్ నియోజక వర్గంతోపాటు పొరుగున ఉన్న మజిథా నుంచి సాద్ పోటీ లోకి దింపుతోంది. కాంగ్రెస్ నుంచి అమృత్‌సర్ ఈస్ట్ అభ్యర్థిగా నవజ్యోత్ సింగ్ సిద్దూ బరిలో ఉన్నారు. మజిధియా రెండు చోట్ల పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే హోరాహోరీ యుద్ధంగా భావిస్తే మాత్రం ఆయన మజిథా నియోజక వర్గం వదిలి, ఒక్క అమృత్‌సర్ ఈస్ట్ నుంచే తనపై పోటీకి దిగాలని సవాలు చేశారు. బిక్రం సింగ్ మజిథియా గతంలో 2007,2012, 2017 ఎన్నికల్లో మజిథా నియోజక వర్గం నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News