Monday, December 23, 2024

నీ సిఎం కుర్చీ సిద్ధూ ఇచ్చిన బహుమతి: నవ్‌జ్యోత్ కౌర్

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: కాంగ్రెస్ నేత నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సిద్ధూ భార్య నవ్‌జ్యోత్ కౌర్ సంచలన విషయాలు బయటపెట్టారు. పంజాబ్‌కు సారథ్యం వహించాలని అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా సిద్ధూను కోరారని, అయితే సొంత పార్టీకి (కాంగ్రెస్‌కు) ద్రోహం చేయడానికి సిద్ధూ ఇష్టపడలేదని ఆమె తెలిపారు.‘ మీరు కూర్చున్న కుర్చీ మీ సోదరుడు (సిద్ధూ) మీకు బహుమతిగా ఇచ్చినదనే విషయాన్ని మీరు గ్రహించాలి’ అని కౌర్ శుక్రవారం వరస ట్వీట్లలో పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరిలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆదీ పార్టీ ఘన విజయం సాధించి భగవంత్ సింగ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్.. మీ ట్రెజర్ హంట్‌లోని ఓ సీక్రెట్‌ను ఈ రోజు బయటపెడుతున్నాను.మీరు పొందిన గౌరవ స్థానం (ముఖ్యమంత్రి సీటు)మీ సోదరుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ మీకు కానుకగా ఇచ్చిందనే విషయాన్ని గుర్తించండి.మీ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడే స్వయంగా పంజాబ్‌కు సారథ్యం వహించమని సిద్ధూను కోరారు’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. పంజాబ్‌లో ఆప్ పార్టీకి నాయకత్వం వహించమని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వివిధ మార్గాలద్వారా సిద్ధూను కోరారని ఆమె తెలిపారు.పంజాబ్ పట్ల సిద్ధూకు ఉన్న అభిరుచి గుర్తించే కేజ్రీవాల్ సంప్రదింపులు జరిపారని, అయితే సొంత పార్టీకి ద్రోహం చేయకూడదనే ఉద్దేశంతో సిద్ధూ అందుకు అంగీకరించలేదని,అందువల్లనే మీకు సిఎంగా అవకాశం లభించిందని కౌర్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

విజిలెన్స్ నిఘాలో ఉన్న పంజాబ్ డెయిలీ సంపాదకుడికి మద్దతుగా జలంధర్‌లో సమావేశమైన విపక్ష పార్టీలపై పంజాబ్ సిఎం మాన్ ఆదివారం విమర్శల బాణం ఎక్కుబెట్టారు. దీనిపై సిద్ధూ ఘాటుగా స్పందించారు.ప్రజాస్వామ్యాన్ని విజిలెన్స్ సిస్టంగా మార్చడానికి ప్రయత్నిస్తున్న ఢిల్లీ పాలకుల చేతిలో పంజాబ్ పాలకులు రిమోట్ కంట్రోట్‌గా మారారంటూ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News