Saturday, January 4, 2025

ప్రసార భారతి కొత్త ఛైర్మన్‌గా నవనీత్ కుమార్ సెఘాల్

- Advertisement -
- Advertisement -

గత నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్న ప్రసార భారతి ఛైర్మన్ పదవికి రిటైర్డ్ ఐఎఎస్ అధికారి నవనీత్ కుమార్ సెఘాల్ నియామకమయ్యారు. ఈ పదవిలో అంతకు ముందున్న ఎ. సూర్యప్రకాష్‌కు 70 ఏళ్లు రావడంతో ఆయన పదవీకాలం 2020 ఫిబ్రవరితో ముగిసింది. ప్రసారభారతి ఛైర్మన్ పదవిలో ఉన్న వారి గరిష్ట వయోపరిమితి 70 ఏళ్లు. నవనీత్ కుమార్ సెఘాల్ ను ఎంపిక చేస్తూ సెలెక్షన్ కమిటీ చేసిన సిఫార్సును రాష్ట్రపతి ఆమోదించారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్ల వరకు లేదా 70 ఏళ్లు వయోపరిమితి వచ్చే వరకు ఈ పదవిలో సెఘాల్ కొనసాగుతారు. ఈమేరకు సమాచారం, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వశాఖ మార్చి 15న ఉత్తర్వులు జారీ చేసింది. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధంకర్ నేతృత్వంలో సెలెక్షన్ ప్యానెల్ నవనీత్ కుమార్ సెఘాల్‌ను ఎంపిక చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News