Monday, December 23, 2024

కోర్టుకు నవనీత్ రాణా గైర్హాజరు

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నివాసం వెలుపల హనుమాన్ చాలీసా పఠించిన వివాదంపై 2022లో నమైదన కేసులో బుధవారం కోర్టులో హాజరుకావలసిన బిజెపి మాఈజ ఎంపి నవనీత్ రాణా అనారోగ్య కారణంపై గైర్హాజరయ్యారు. కాగా..ఆమె భర్త, అమ్రావతి ఎమ్మెల్యే రవి రాణా మాత్రం ఇదే కేసులో కోర్టు ఎదుట హాజరయ్యారు. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే అధికారిక నివాసం బాంద్రాలోని మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ రాణా ప్రకటించారు. ఆమెను అరెస్టు చేసేందుకు ముంబైలోని ఖేర్ ప్రాతంలోని ఆమె నివాసం వద్దకు వెళ్లిన పోలీసు అధికారులతో ఆమె వాగ్వాదానికి దిగడమేకాక పోలీసులు తమ విధులను నిర్వర్తించకుండా అడ్డుపడినందుకు ఆమెపై ఐఇపిసిలోని 353 సెక్షన్ కింద కేసు నమోదైంది.

ఈ కేసును కొట్టివేయాలంటూ ఆమె నవనీత్ రాణా దంపతులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్‌ను కోర్టు 2023 డిసెంబర్‌లో తిరిస్కరించింది. జనవరి నుంచి ఈ కేసు విచారణ పలు దఫాలు వాయిదా పడుతోంది. నిందితులు కోర్టుకు హాజరుకాకపోవడంతో విచారణ ప్రక్రియ ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. గత విచారణ సందర్భంగా రాణా దంపతులు జూన్ 12న కచ్ఛితంగా హాజరు కావాలని ఎంపి, ఎమ్మెల్యే కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఆర్‌ఎన్ రోకడే ఆదేశించారు. అయితే బుధవారం నవనీత్ రాణా గైర్హాజరు కాగా ఆమె భర్త రవి రాణా మాత్రం కోర్టు ఎదుట హాజరయ్యారు. కేసు తదుపరి విచారణను జులై 2వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News