Monday, December 23, 2024

రెచ్చిపోతున్న ఎంపీ నవ్‌నీత్ రాణా

- Advertisement -
- Advertisement -

Navneet Rana

దమ్ముంటే తనపై పోటీ చేయాలని మహారాష్ట్ర సిఎంకు సవాలు!

ముంబై: ఆసుపత్రి నుంచి ఆదివారం డిశ్చార్చి అయిన స్వతంత్ర ఎంపీ నవ్‌నీత్ రాణా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కేవలం రాముడి పేరు స్మరించినందుకే తనను వేధించి, లాకప్‌లో పెట్టారన్నారు. ఈ సందర్భంగా ఆమె రెచ్చిపోయి ‘నీకు దమ్ముంటే మహారాష్ట్రలోని ఏ జిల్లాలోనైన సరే…నాపై పోటీ చేయి. నీతో నేను పోటీపడతాను. అప్పుడు రాష్ట్ర ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో చూడు” అని బీరలు పోయింది. ఇటీవలై ఆమె లీలావతి ఆసుపత్రిలో చేరి స్పాండిలోసిస్‌కు చికిత్స పొందింది. ఆదివారమే డిశ్చార్జీ అయింది.
“హనుమాన్ చాలీసా పఠించడమే నేరమా? అయితే నేను జైలులో ఉండడానికి ఇష్టపడతాను. కేవలం 14 రోజులే కాదు, 14 సంవత్సరాలైనా ఉంటాను. 14 రోజులు జైలులో ఉంచి నీవు మహిళ నోరు నొక్కేయాలని చూసావు. కానీ నీ పప్పులు ఉడకవు. మేము దేవుడి పేరిట పోరాడతాం. దాన్ని కొనసాగిస్తాం” అని ఆమె దంచేసింది.
“ నీ పూర్వికుల పేరుప్రఖ్యాతులతో నీవు ముఖ్యమంత్రివి అయ్యావు. దమ్ముంటే ఎన్నికల్లో నాతో పోటీపడి గెలువు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజలు నీకు తగు జవాబిస్తారు. కేవలం రాముడి పేరెత్తినందుకు నాపై జులుం చేశావు” అని ఆమె విరుచుకుపడ్డారు. కోర్టు తీర్పును తాను గౌరవిస్తానని కూడా ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేసింది. తాను ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేయడంపై ఫిర్యాదు చేస్తానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News