Monday, December 23, 2024

నవోదయలో ఆరవ తరగతి ప్రవేశాలకు గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః వచ్చే విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల గడువు ఆగస్టు 17 వరకు పొడిగించినట్లు నవోదయ విద్యాలయ సమితి వెల్లడించింది. ఆసక్తి కలిగిన విద్యార్థులు గడువులోగా ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా 883 జెన్‌విలో 6వ తరగతి సీట్ల భర్తీకి రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నవంబర్ 4న ఉదయం 11.30గంటలకు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో, 2024 జనవరి 20 (శనివారం) తేదీన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 613 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉండగా ఏపీలో 15, తెలంగాణలో 9 చొప్పున ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News