Monday, December 23, 2024

నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్ వగీర్ జలాంతర్గామి

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత నౌకాదళం కల్వరీ క్లాస్ జలాంతర్గామి ‘వగీర్’ను సోమవారం ముంబై నౌకాదళ డాక్‌యార్డ్‌లో ప్రవేపెట్టింది. నావికాదళ సిబ్బంది చీఫ్ అడ్మిరల్ ఆర్. హరి కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతథిగా హాజరయ్యారు. ప్రాజెక్ట్ 75 కింద నిర్మించిన ఐదో కల్వరి క్లాస్ జలాంతర్గామి ఇది. ‘వగీర్’ అంటే షార్క్‌చేప. ఈ పేరును 1973-2001 వరకు వినియోగించిన ఓ పాత జలాంతర్గామి నుంచి తీసుకున్నారు. ఈ కొత్త జలాంతర్గామిని మాజిగావ్ డాక్ షిప్ బిల్డర్స్ సంస్త నిర్మించింది. దీనికోసం ఫ్రాన్స్ ‘నావల్ గ్రూప్’ నుంచి సాంకేతికత భారత్‌కు బదిలీ అయింది. ఈ జలాంతర్గామికి ప్రపంచంలోనే అత్యుత్తమ సోనార్లను అమర్చారు. దీనిలో వైర్ గైడెడ్ టార్పిడోలు కూడా ఉన్నాయి. సముద్రం మధ్యలో, తీరాల సమీపంలో కూడా ఐఎన్‌ఎస్ వగీర్ జలాంతర్గామిని మోహరించవచ్చు. దేశీయంగా నిర్మించిన అత్యాధునిక జలాంతర్గాములలో ఇదొకటి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News