Monday, December 23, 2024

వైజాగ్ లో దారుణం.. నేవి ఆఫీసర్ కూతురిపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

విశాఖలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ నేవి అధికారి కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పదో తరగతి చదువుతున్న 14ఏళ్ల నేవి ఆఫీసర్ కూతురిపై కొద్ది రోజులుగా సామూహిక లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తోంది. బాలిక చదవుతున్న పాఠశాలలో ప్యూన్ గా పనిచేస్తున్న సత్యారావు ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాలికను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి భయపెట్టి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ప్యూన్ సత్యారావుతోపాటు మరో ముగ్గురు నిందితులు జూన్ 3వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పలుమార్లు అత్యాచారం చేశారు. తన కూతురిపై లైంగిక దాడి జరిగిందని నేవి అధికారి విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందులను అదుపులోకి తీసుకుని పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News