Friday, December 20, 2024

దామగుండానికి దారిచ్చిందెవరు?

- Advertisement -
- Advertisement -

నేవీ రాడార్ స్టేషన్‌కు బిఆర్‌ఎస్సే అనుమతిచ్చింది
రాష్ట్ర ప్రభుత్వం ఆధారాలు

2017 డిసెంబర్‌లోనే జిఒ జారీ
2900 ఎకరాల అటవీభూమి కేటాయిస్తూ
కెసిఆర్ హయాంలోనే ఉత్తర్వులు
దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని
కెటిఆర్ రాజకీయం చేయడం ఆయన
నిజస్వరూపానికి నిదర్శనమని ధ్వజం
నేవీ రాడార్ స్టేషన్‌కు నేడు శంకుస్థాపన
హాజరుకానున్న రక్షణశాఖ మంత్రి
రాజ్‌నాథ్ సింగ్, కేంద్రమంత్రులు
కిషన్‌రెడ్డి, బండి సంజయ్,
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా దామగుండంలో మంగళవా రం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చే యనున్న నేవీ రాడర్ స్టేషన్ ప్రభుత్వ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎ స్ మధ్య మరో వివాదానికి దారితీసింది. ఈ కేంద్రం ఏర్పాటును ప్రతిపక్ష బీఆర్‌ఎస్ వ్యతిరేకించినట్టు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రకటనలో వాస్తవం లేదని, అసలు ఈ కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇచ్చిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అని ఉటంకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు వివరాలు అందజేసింది. దామగుండం రాడర్ స్టేషన్ ప్రక్రియ, దానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల క్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసింది.

గత ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్లనే కేంద్ర రక్షణ శాఖ వికారాబాద్ జిల్లా పూడూరు గ్రామం వద్ద ఏర్పాటు చేయబోయే రాడర్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర సహకరించాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ప్ర భుత్వం సమర్ధించుకుంది. ఈ ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రా వు హయాంలోనే తుది అనుమతి లభించిందని గుర్తు చేసింది. దీనికి సంబంధించి అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెంబర్ 44 డిసెంబర్ 12, 2017వ తేదీ న పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్ విభాగం ద్వారా జారీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్ డివిజన్ పరిధిలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లోని 1174.00 హెక్టార్ల (2,900 ఎకరాలు) అటవీ భూమిని విఎల్‌ఎఫ్ రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

అటవీ సంరక్షణ చట్టం, 1980లోని సెక్షన్-2 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని నేవీ హెడ్‌క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్‌కు బదలాయించినట్టు పేర్కొంది. ఇదంతా జరిగింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే అయినప్పటికీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు బీఆర్‌ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొనడం, ఆయన కపటబుద్ధికి నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వం దుయ్యబట్టింది. దేశభద్రతకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేయడం కేటీఆర్ నిజస్వరూపానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్రంరాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాక్య స్ఫూర్తి కొనసాగాలని, పైగా ఇది జాతీయ భధ్రతకు సంబంధించిన ప్రాజెక్టు కావడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. అంతకుముందు ఉదయం కెటిఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు పదేళ్లుగా ఒత్తిడి తెచ్చినా, తమ ప్రభుత్వం లొంగలేదని అన్నారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు

* తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 ఆగస్టు 11న అప్పటి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఆ భూముల బదలాయింపునకు సంబంధించి ఎంత చెల్లింపులు చేయాలో లెక్కలేసి డిమాండ్ నోట్ ను నెవీ విభాగానికి పంపించారు.
* 2017 ఫిబ్రవరి 25న పాత డిమాండ్ నోటీస్ ను పెరిగిన వేజెస్ కు అనుగుణంగా పెంచటంతో పాటు ప్లాంటేషన్ కు సంబంధించిన స్థల మార్పును సూచిస్తూ మరోసారి నెవీకి లెటర్ రాశారు.
* 2017 మార్చి 2న నేవీ విభాగం రాష్ట్ర అటవీ శాఖ పంపిన డిమాండ్ నోటీసు ప్రకారం రూ.133.54 కోట్లు ఖాతాలో జమ చేసింది.
* 2017 మే 25వ అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ స్టేజ్ 1 అనుమతులకు సంబంధించిన సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు.
* 2017 జులై 31న కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ మరింత అదనపు సమాచారం కోరింది
* 2017 సెప్టెంబర్ 21న కేంద్రం కోరిన అదనపు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపించింది.
* 2017 నవంబర్ 14న కేంద్ర ప్రభుత్వం దామగూడెం రిజర్వు ఫారెస్ట్ కు చెందిన 1174 హెక్టార్ల భూముల బదిలీకి సంబంధించి స్టేజ్ 2 తుది అనుమతులు మంజూరు చేసింది.
* 2017 డిసెంబర్ 19న రాష్ట్ర ప్రభుత్వం అటవీ భూములను నేవీకి బదిలీ చేస్తూ జీవో నెం.44 జారీ చేసింది.
* 2017 డిసెంబర్ 22న తుది అనుమతులకు సంబంధించిన జీవో సంబంధిత జిల్లా అటవీ అధికారికి చేరింది.
* భూసంరక్షణ చర్యలకు సంబంధించిన మొత్తం ఖర్చుల్లో 25 శాతం చెల్లింపులు చేయాలని డీఎఫ్‌వ నేవీకి నోటీసు జారీ చేశారు. నేవీ విభాగం జనవరి 20వ తేదీన ఈ ఛార్జీలు రూ.18.56 కోట్లు చెల్లించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News