Monday, December 23, 2024

కరోనా వేళ దేశ నౌకాదళ పాత్ర ఆద్వితీయం: రాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -


మనతెలంగాణ/హైదరాబాద్:  కరోనా మహమ్మారి సమయంలో దేశ నౌకా దళ అధికారుల, సిబ్బంది పాత్రను ప్రశంసనీయమని భారతరాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో సోమవారం నాడు జరిగిన ‘ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈక్రమంలో నావికా దళాలు త్రివిధ దళాల అధిపతి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిందుకు ఘనంగా గౌరవ వందనం చేశారు. పిఎఫ్‌ఆర్-22లో భాగంగా నౌకాదళానికి చెందిన రెండు నౌకాదళాలను, యుద్ధనౌకలు, కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌తో కూడిన 60 నౌకలు, 10 వేల మంది సిబ్బందితో కూడిన జలాంతర్గాములకు సంబంధించిన నౌకాదళ శక్తిసామర్ధ్యాలను రాష్ట్రపతి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ ‘కోవిడ్ -19‘ మహమ్మారి సమయంలో నేవీ అధికారులు, సిబ్బంది పలు దేశాలకు వైద్య సహాయం అందించారని అలాగే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విదేశీ పౌరులను తరలించారన్నారు.

అంతేకాదు భారత నౌకాదళం నిరంతర నిఘా, సంఘటనలపై సత్వర ప్రతిస్పందన, అలుపెరగని ప్రయత్నాలు సముద్రాల భద్రతను కాపాడుకోవడంలో అత్యంత విజయవంతమైందన్నారు. ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ భాగం హిందూ మహాసముద్ర ప్రాంతంలోనే జరుగుతోందని మన వాణిజ్యం, ఇంధన అవసరాలలో గణనీయమై భాగం మహాసముద్రాల ద్వారానే తీరుతుందని కోవింద్ స్పష్టం చేశారు. అంతేకాదు భారత నావికాదళ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, మన సముద్ర శక్తికి సంబంధించిన ఇతర అంశాల సంసిద్ధతను సమీక్షిస్తున్నందుకు తాను చాలా సంతోషిస్తున్నాని చెప్పారు. భారత నావికాదళం మరింత స్వావలంబనగా మారుతోందని, ’మేక్ ఇన్ ఇండియా’ చొరవలో ముందంజలో ఉందన్నారు. భారతదేశం అణు జలాంతర్గాములను నిర్మించడం చాలా గర్వించదగ్గ విషయంగా పేర్కొన్నారు.

అంతేగాక 1971 యుద్ధ సమయంలో విశాఖపట్నం నగరం అద్భుతమైన సహకారం అందించిందని ఆయన వివరించారు. పిఎఫ్‌ఆర్‌లో పాల్గొన్న 70 శాతం నౌకలు, జలాంతర్గాములు ఇక్కడే తయారు చేశారని, దేశీయ తయారీ విక్రాంత్, న్యూక్లియర్ సబ్ మెరైన్లు దేశానికి గర్వకారణమని ఆయన వెల్లడించారు. దేశీయ తయారీ విక్రాంత్, న్యూక్లియర్ సబ్మెరైన్లు మనకు గర్వకారణం. మిలన్ 2022 సందర్భంగా నౌకాదళానికి అభినందనలు తెలిపారు. అనంతరం సాయుధ దళాల కమాండర్ మాట్లాడుతూ నౌకలు, విమానాలు, జలాంతర్గాముల అద్భుతమైన కవాతు ప్రదర్శించిందన్నారు. ఎలాంటి ఆకస్మిక పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సన్నద్ధతను కూడా ఈ కవాతు ప్రదర్శించిందని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News