Saturday, December 21, 2024

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ నేవీ జవాను మృతి

- Advertisement -
- Advertisement -

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన నేవీ జవాన్ మారెడ్డి సందీప్‌రెడ్డి(26) మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నర్సింహాపురానికి చెందిన సందీప్‌రెడ్డి నేవీ జవాన్‌గా కర్ణాటకలోని నావెల్‌బేస్‌లో సైలర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మే 28వ తేదీన కర్ణాటకలో రోడ్డు ప్రమాదానికి గురవ్వగా స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందీప్ గురువారం మృతి చెందినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. సందీప్ మృతితో నకిరేకల్ గ్రామమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. భారత నేవీ గౌరవవందనంతో అంత్యక్రియలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News