వాషింగ్టన్: ఇండియన్‌అమెరికన్ నావికాదళం ప్రముఖురాలు శాంతి సేథీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ రక్షణ సలహాదారుగా నియమితురాలయింది. శాంతి సేథి డిసెంబర్ 2010 నుండి మే 2012 వరకు USS డెకాటూర్ అనే గైడెడ్-మిసైల్ డిస్ట్రాయర్‌కు నాయకత్వం వహించారు. భారతదేశాన్ని సందర్శించిన అమెరికా నౌకాదళ నౌకకు ఆమె మొదటి మహిళా కమాండర్ కూడా. యుఎస్ నేవీ యుద్ధ నౌకలో మొదటి భారతీయ-అమెరికన్ కమాండర్ శాంతి సేథి ఇటీవల వైస్ ప్రెసిడెంట్ హారిస్ కార్యాలయంలో చేరారు, వైస్ ప్రెసిడెంట్ సీనియర్ సలహాదారు హెర్బీ జిస్కెండ్‌ను ఉటంకిస్తూ ‘పొలిటికో’ తెలిపింది.
శాంతి సేథి తండ్రి 1960ల ప్రారంభంలో భారతదేశం నుండి అమెరికాకి వలస వెళ్లారు. కాగా కమలా హ్యారీస్ యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన మొట్టమొదటి భారతీయ సంతతి వ్యక్తి.
Indian-American Navy veteran Shanti Sethi appointed Kamala Harris’s defence advisorhttps://t.co/ACGQibDlSu
— The Indian Express (@IndianExpress) April 19, 2022