Friday, December 20, 2024

నవ్య పైలెట్ కలకు చేయూత

- Advertisement -
- Advertisement -

గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన వేల్పుల నవ్య చదువులో అద్భుత ప్రతిభ కనబరుచుతూ పైలెట్ శిక్షణకు ఎన్నికైంది. ప్లయింగ్ శిక్షణ కోసం ప్రభుత్వం 36 లక్షల స్కాలర్‌షిప్ అందజేస్తుండగా గ్రౌండ్ శిక్షణ కోసం మూడు లక్షలు నవ్య భరించాల్సి ఉంటుంది. నిరుపేద కుటుంబం కావడంతో ఖర్చులు భరించే స్థోమత లేకపోవడంతో దాతల సహకారం కోసం ఎదురుచూసింది.

సామాజిక మాధ్యమాల్లో నవ్య గురించి వచ్చిన వార్తలను చూసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పందించారు. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఆయన జన్మదినం సందర్భంగా నవ్య కుటుంబ సభ్యులను గంగాధర మండలం బూరుగుపల్లిలోని తన నివాసానికి ఆహ్వానించారు.

వారితో కలిసి బ్రేక్ ఫాస్టు చేసి కుటుంబ వివరాలు, పైలెట్ శిక్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా శిక్షణ కోసం 50,000ల రూపాయలను ఎమ్మెల్యే అందజేశారు. దాతలు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు నవ్య పైలెట్ శిక్షణ కోసం ఆర్థిక సహాయం అందజేయాలని ఎమ్మెల్యే సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News