- Advertisement -
ముంబయి: మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోగ్య కారణాలపై తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని ఇక్కడి ప్రత్యేక పిఎంఎల్‌ఎ కోర్టును అభ్యర్థించారు. మనీ లాండరింగ్ కేసులో ఫిబ్రవరి 23న మాలిక్‌ను ఇడి అరెస్టు చేయడంతో ప్రస్తుతం ఆయన జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మూత్ర పిండ సమస్యలతో బాధపడుతున్న తనకు ప్రస్తుతం కాళ్లలో వాపులు వచ్చాయని 62 ఏళ్ల మాలిక్ పిఎంఎల్‌ఎ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తులో విన్నవించారు. ప్రత్యేక న్యాయమూర్తి ఆర్‌ఎన్ రోకడే ఎదుట తాత్కాలిక బెయిల్ కోసం మాలిక్ తరఫున న్యాయవాది తర్రాక్ సయ్యద్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై వచ్చే సోమవారంవిచారణ జరగనున్నది.
- Advertisement -