Monday, December 23, 2024

మంత్రి నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీ 18 వరకు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Nawab Malik Judicial Custody upto 18

ముంబై : మహారాష్ట్ర మంత్రి , ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక పీఎంఎల్‌ఎ కోర్టు ఈనెల 18 వరకు పొడిగించింది. సోమవారంతో రిమాండ్ ముగియడంతో ఈడీ అధికారులు ఆయనను ముంబై ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు వారాలకు పొడిగించింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసుపై ఆయనను ఫిబ్రవరి 23న అరెస్టు చేశారు. మాలిక్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసినా ఈ అరెస్టు అక్రమమని మాలిక్ వాదిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని గతంలో ఆయన ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News