Monday, December 23, 2024

డంప్ యార్డ్ చుట్టూ అల్లుకున్న కథ

- Advertisement -
- Advertisement -

హరిహర క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్‌ఎం నిర్మాణ సారథ్యంలో రవిచరణ్ దర్శకత్వం వహిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ’నవాబ్’. ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ళ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

రా అండ్ రస్టిక్ లుక్ తో, ముందు డబ్బుల కట్టలు, వెనుక డంప్ యార్డ్, మధ్యలో రక్తపు మరకలతో ఇంటెన్సివ్ గా సిగార్ తాగుతున్న హీరో పోస్టర్ కచ్చితంగా సమ్‌థింగ్ స్పెషల్‌గా కనిపిస్తూ.. చూడగానే ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఒక డంప్ యార్డ్ చుట్టూ అల్లుకున్న కథ అని, ఆద్యంతం ఉత్కంఠభరితమైన థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ప్రేక్షకుడికి ’నవాబ్’ చిత్రం అందిస్తుందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News