Monday, December 23, 2024

ఈద్ తర్వాత పాకిస్థాన్ తిరిగి రానున్ననవాజ్ షరీఫ్

- Advertisement -
- Advertisement -

Nawaz Sheriff return

తన చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు లాహోర్ హైకోర్టు నాలుగు వారాల అనుమతి ఇవ్వడంతో నవాజ్ షరీఫ్ నవంబర్ 2019లో లండన్ వెళ్లిపోయారు.

ఇస్లామాబాద్:  పదవీచ్యుతుడైన పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ రంజాన్ పండుగ తర్వాత తిరిగి పాకిస్థాన్ రానున్నారని పిఎంఎల్‌ఎన్ పార్టీ నాయకుడొకరు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా పదవీచ్యుతుడయ్యాక రాజకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సంకీర్ణ భాగస్వాములతో చర్చించాక నవాజ్ షరీఫ్ దేశానికి తిరిగా రాక గురించి నిర్ణయం తీసుకుంటామని పిఎంఎల్‌ఎన్ సీనియర్ నాయకుడు మియా జావేద్ లతీఫ్ తెలిపారు. అన్ని నిర్ణయాలు సంకీర్ణ భాగస్వాములతో చర్చించాకే నిర్ణయిస్తామని కూడా ఆయన తెలిపారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై పనామా పేపర్స్ కేసులో పాకిస్థాన్‌లో అనేక అవినీతి ఆరోపణలున్నాయి. లాహోర్ హైకోర్టు చికిత్స కోసం నాలుగు వారాల అనుమతి ఇవ్వడంతో ఆయన 2019 నవంబర్‌లో దేశం విడిచిపోయారు. కాగా అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌కు బెయిల్ లభించింది. ఆ కేసులో ఆయనకు లాహోర్‌కు చెందిన కోట్ లఖ్‌పత్ జైలు ఏడేళ్ల ఖైదు కూడా విధించబడింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొని ఉంది. పాకిస్థాన్‌లో తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మూడున్నర ఏళ్లు పాలించింది. ఆ దేశం అప్పులలో కూరుకుపోవడంతో, అనిశ్చితి వాతావరణం నెలకొంది. ఓ విదేశీ కుట్ర, అక్కడి ప్రతిపక్ష నాయకుల ఒత్తిడితో ఇమ్రాన్ ఖాన్ పదవిని కోల్పోవలసి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News