Thursday, January 9, 2025

పాకిస్తాన్ చేరుకున్న నవాజ్ షరీఫ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ శనివారం పాకిస్తాన్‌కు తిరిగివచ్చారు. నాలుగేళ్లపాటు బ్రిటన్‌లో తనకు తానుగా విధించుకున్న అజ్ఞాత జీవితాన్ని గడిపిన నవాజ్ షరీఫ్ ఒక ప్రత్యేక విమానంలో పాకిస్తాన్‌కు తిరిగివచ్చారు. వచ్చే జనవరిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీకి విజయాన్ని చేకూర్చేందుకు ఆయన స్వదేశానికి తిరిగివచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పాకిస్తాన్ ముస్లిం లీగ్-మువాజ్(పిఎంఎల్ -ఎన్) అధ్యక్షుడైన 73 ఏళ్ల నవాజ్ షరీఫ్ తన కుటుంబ సభ్యులు కొందరితో కలసి ఉమీద్ ఇ పాకిస్తాన్ అనే ప్రత్యేక విమానంఓ దుబాయ్ నుంచి ఇస్లామాబాద్ చేరుకున్నట్లు పార్టీ ఆయన నాయకులు, స్నేహితులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News