Saturday, January 11, 2025

తోషాఖానా అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌కు బెయిల్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: నాలుగేళ్ల తరువాత లండన్ నుంచి పాకిస్థాన్‌కు తిరిగి వచ్చిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మొదటిసారి మంగళవారం ఇస్లామాబాద్ అకౌంటబిలిటీ కోర్టుకు హాజరు కాగా తోషాఖానా అవినీతి కేసులో బెయిల్ నిర్ధారణ అయింది. పాకిస్థాన్‌కు మూడుసార్లు ప్రధాని పదవి చేపట్టిన 73 ఏళ్ల షరీఫ్ శనివారం లండన్ నుంచి తిరిగి వచ్చారు. ఆయన రాకకు ముందుగానే ఆయన తాలూకు న్యాయవాదుల బృందం ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో హైకోర్టు షరీఫ్‌కు ఈనెల 24 వరకు ఎవెన్‌ఫీల్డ్, అల్‌అజీజియా అవినీతి కేసులో ప్రొటెక్టివ్ బెయిల్ మంజూరు చేసింది. దీంతోపాటు తోషాఖానా అవినీతి కేసులో అరెస్ట్ వారంట్‌ను అవినీతి నిరోధక కోర్టు రద్దు చేసింది.

షరీఫ్ ఇక్కడ లేనందున ఆగిపోయిన కేసులన్నీ ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయి. మంగళవారం షరీఫ్ అకౌంటబులిటీ కోర్టుకు హాజరు కావడం కోర్టుకు లొంగిపోయిన సంకేతం వెలువడింది. షరీఫ్ కోర్టుకు లొంగిపోయినందున ఆయన అరెస్టు వారంట్‌ను రద్దు చేయాలని, వారంట్ రద్దు చేస్తే విచారణ ముందుకు సాగుతుందని నేషనల్ అకౌంట్‌బులిటీ బ్యూరో(ఎన్‌ఎబి) ప్రాసిక్యూటర్ వాదించారు. దీంతో జడ్జి ఒక మిలియన్ రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసు విచారణను నవంబర్ 20కి వాయిదా వేశారు. ఇది కాక మరో కేసులో షరీఫ్‌కు ఊరట లభించింది. అల్ అజీజియా అవినీతి కేసులో పడిన శిక్షను పంజాబ్ ప్రభుత్వం మంగళవారం రద్దు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News