Friday, November 15, 2024

ఇండియా చంద్రుడిపై ఉంటే పాక్ భూమిపైనే ఉంది

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీష్ మళ్లీ భారత్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. గత బుధవారం ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పిఎంఎల్-ఎన్) కార్యకర్తలనుద్దేశించి ఆ పార్టీ అధ్యక్షుడైన నవాజ్ షరీఫ్ ప్రసంగిస్తూ భారత ప్రధాని మోడీ నాయకత్వాన్ని మరోసారి కీర్తించారు. భారత్‌ను ప్రశంసిస్తూ మన చుట్టూ ఉన్న దేశాలు చంద్రుడిని చేరుకున్నాయని నవాజ్ షరీఫ్ అన్నారు.

పాకిస్తాన్ ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఆయన ప్రస్తావిస్తూ పాకిస్తాన్ మాత్రం ఇంకా భూమి పైనుంచి లేవలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పతనానికి పాకిస్తానే బాధ్యురాలని ఆయన స్పష్టం చేశారు. చంద్రుడిపై పాదంమోపిన నాలుగవ నాలుగవ దేశంగా, చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా భారత్ ఖ్యాతినార్జించింది. ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా నేలను తాకింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News