- Advertisement -
ఇస్లామాబాద్ : ఏళ్ల తరబడి ప్రవాసం తరువాత పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వచ్చే నెలలో తిరిగి స్వదేశానికి వచ్చే వీలుంది. రంజాన్ ఈద్ తరువాత ఆయన పాకిస్థాన్ వస్తారని పిఎంఎల్ ఎన్ సీనియర్ నేత ఒకరు సోమవారం తెలిపారు. పాకిస్థాన్‌లో ఈ పార్టీ నేత షెహబాజ్ ప్రధాని అయ్యారు. దీనితో సీనియర్ షరీఫ్ స్వదేశాగమనానికి మార్గం సుగమం అయింది. మే తొలివారంలో రంజాన్ పర్వదినం ఉంటుంది. షరీఫ్ రాక అంశంపై పిఎంఎల్ ఎన్ పార్టీ వర్గాలు తమ మిత్రపక్ష పార్టీల నేతలతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తాయని భావిస్తున్నారు. అంతా అనుకూలంగా ఉండటంతో సుదీర్ఘకాలంగా లండన్‌లో ఉంటూ పలు కేసులు ఎదుర్కొంటోన్న నవాజ్ పాకిస్థాన్‌కు రావడం ఖాయం అయినట్లే అని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
- Advertisement -