ఇస్లామాబాద్: పదవీచ్యుతికి గురైన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కోర్టు విచారణను ఎదుర్కోవడానికి వచ్చే నెల రంజాన్ పండుగ తర్వాత లండన్ నుంచి పాక్ తిరిగిరానున్నట్లు పిఎంఎల్-ఎన్ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు బుధవారం వెల్లడించారు. మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన నవాజ్ షరీఫ్ స్వదేశానికి తిరిగిరావడానికి పాక్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం మంగళవారం పాస్‌పోర్టు జారీచేసిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని ప్రభుత్వం అనేక అవినీతి కేసులను నమోదు చేయడంతో వైద్య చికిత్సల నిమిత్తం విదేశాలకు వెళ్లడానికి లాహోర్ హైకోర్టు నాలుగు వారాల అనుమతి ఇవ్వడంతో 72 ఏళ్ల పిఎంఎల్-ఎన్ అధినేత 2019 నవంబర్‌లో లండన్ వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆయన అక్కడే ఉండిపోయారు. కాగా..రంజాన్ పండుగ తర్వాత నవాజ్ షరీఫ్ స్వదేశానికి తిరిగివచ్చి పాకిస్తాన్‌లో బహిరంగ సభలను నిర్వహిస్తారని ఫెడరల్ మంత్రి మియాన్ జావేద్ విలేకరులకు తెలిపారు. స్వదేశానికి తిరిగివచ్చిన వెంటనే ఆయనను అరెస్టు చేయకపోతే మే 6 నుంచి నవాజ్ షరీఫ్ రాజకీయ ర్యాలీలను నిర్వహిస్తారని ఆయన చెప్పారు.
రంజాన్ తర్వాత పాక్‌కు నవాజ్ షరీఫ్ రాక
- Advertisement -
- Advertisement -
- Advertisement -