లక్నో : నిరాశ నిస్పృహలు కేవలం పట్టణ, నగర జనితాలు, డబ్బూ దస్కం, తెచ్చిపెట్టుకున్న గౌరవ మర్యాదల క్రమంలోనే ఇవి తలెత్తుతాయని నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీ తెలిపారు. నిరాశ పడటం కేవలం అర్బన్, సిటీ క్రమంలో తలెత్తే పరిణామం అని ప్రస్తుతం యువతలో నెలకొంటున్న నిరాశనిస్పృహలు, తరువాతి వైపరీత్యాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా బుద్థానా అనే చిన్న పట్టణంలో సిద్ధిఖీ జన్మించారు. అతి చిన్న విషయాలను గొప్పగా చిత్రీకరించుకునే తత్వం కృత్రిమంగా గొప్పతనం సంతరించుకునే పట్టణ జీవులను సంతరించుకుంటుంది.
దీని తో వారు తమ భావనలకు ప్రతికూలమైన వాటిని వేటిని తట్టుకోలేరని విశ్లేషించారు. గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. కలివిడిగా ఉండ టం తప్పలేని ప్రపంచంలో విహరించడం వీరి నైజం కాద ని, ఎక్కడైనా ఏ కొడుకు తండ్రితో తనకు చికాకుగా ఉం దని చెపితే వెంటనే చెంపచెళ్లు మంటుందన్నారు. ఊర్లలో తరచూ మనసు చిన్నబుచ్చుకోకు అనే పెద్దల మాటలు వినబడుతూ ఉంటాయి. సహజసిద్ధమైన మానసిక ప్రకంపనలను ప్రభావితం చేసే వెలుపలి భావనల తాకిడే జనంలో డిప్రెషన్‌కు దారితీస్తుంది.
అయితే ఇది పల్లెటూర్ల పొలి మేరలు దాటి లోపలికి వెళ్లదని ఈ సహజనటుడు వ్యాఖ్యానించారు. నగరాలలో ఎక్కువగా యువత తరచూ డిప్రెషన్లకు గురి కావడం ఈ క్రమంలో డ్రగ్స్‌కు అలవాటుపడటం, దారుణాలకు పాల్పడటం జరుగుతోంది. ప్రతిభాపాటవాలు కల యువత కూడా ఏదో ఒక విషయంలో విఫలం అయి పండంటి భవిష్యత్తును చేజార్చుకుని విషాదాంతాలకు పాల్పడుతున్న వేళ నిస్పృహలను దరిచేరనివ్వరాదని, ఇందుకు ముందు నిర్థిష్ట పద్ధతిలో మనసుకు ఆలోచనలకు మధ్య సమన్వయం కుదుర్చుకోవల్సి ఉందని ఈ నటుడు తెలిపారు.