Thursday, January 23, 2025

Nawazuddin: ఒక్క షరతుపై పిటిషన్ వాపస్ తీసుకుంటా : నవాజుద్దీన్ సిద్ధిఖీ

- Advertisement -
- Advertisement -

ముంబై: భార్య ఆలియా సిద్ధిఖీతో విడిపోయిన నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన భార్యపై పిటిషన్‌ను ఉపసంహరించుకోడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అందుకు ఒకే ఒక షరతు విధించాడు. అది తన పిల్లలని చూసుకోవడానికి అవకాశం ఇస్తే చాలునని. ఈ విషయాన్ని అతడు బాంబే హైకోర్టుకు తెలిపాడు. భార్య ఆలియాపై దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్‌ను ఉపసంహరించుకోడానికి అతడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ అందుకు అతడు పెట్టిన షరతు ఒక్కటే పిల్లలను కలుసుకోనివ్వాలని.

నవాజుద్దీన్ ఇద్దరు పిల్లలు దుబాయ్‌లోని పాఠశాల నుంచి కనిపించకుండా పోయారు. వారి ఆచూకీ తెలుసుకోవడం కూడా అతడికి కష్టంగా మారిందని ఆయన తరఫు న్యాయవాది ప్రదీప్ థోరత్ తెలిపారు. పిల్లలు కనపడడం లేదన్న ఒకే ఒక్క కారణంగా నవాజుద్దీన్ సిద్ధిఖీ హేబియస్ కార్పొస్ పిటిషన్ వేశారు. ఆయన తన పిల్లలను చూసుకోవడం కుదరడం లేదు. పిల్లలను చూడగలిగితే కేసును ఆయన ఉపసంహరించుకుంటాడని ఆయన లాయర్ వివరించారు. కాగా ఆలియా తరఫు లాయర్ ఈ పిటిషన్ పాయింట్‌లెస్ అన్నారు. ఎందుకంటే ఈ పిటిషన్‌ను ఆయన భార్య ఆలియా, పిల్లలతో కలిసి ఉన్నప్పుడే దాఖలు చేయడం జరిగిందన్నారు. వాస్తవానికి ఆయనకు తన పిల్లలను కలుసుకునే వెసలుబాటు ఉంది. కానీ ఆయనే వారిని కలువలేదు అని ఆమె తరఫు లాయర్ చెప్పుకొచ్చారు. వాస్తవానికి నవాజుద్దీన్, ఆయన భార్య ఆలియా కొన్ని వారాలపాటు పోట్లాడుకున్నారు. అతడు తనను అంధేరి బంగ్లాలోకి అనుమతించడంలేదని భార్య ఆరోపిస్తోంది. ఆ తర్వాత వారిద్దరు ఒకరిపై మరొకరు అనేక ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసుకున్నారు.

Nawaz Post

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News